
జయప్రద (ఫైల్ ఫోటో)
లక్నో : సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదపై సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజామ్ ఖాన్ నోరు జారారు. తనను ఖిల్జీగా అభివర్ణిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అయితే ఈ క్రమంలో ఆమెను ఓ డాన్సర్‌గా అభివర్ణించిన ఆయన ఆపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
శనివారం సాయంత్రం ఓ కార్యక్రమానికి హాజరైన మాట్లాడుతూ.. ‘పద్మావత్ చిత్రం వచ్చింది. ఖిల్జీ పాత్ర చెడ్డదని విన్నా. ఖల్జీ రాకముందే పద్మావతి ప్రాణ త్యాగం చేసింది. కానీ, ఇప్పుడు ఓ డాన్సర్ నాపై వ్యాఖ్యలు చేస్తోంది. మరి ఈ డాన్సర్ పాడే పాటను వినుకుంటూ కూర్చుంటే.. రాజకీయాలపై నేనెలా దృష్టిసారిగలను? అంటూ అజామ్ వ్యాఖ్యానించారు.
కాగా, ‘పద్మావత్’ సినిమాలో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రను చూస్తే తనకు ఆజామ్ ఖాన్ గుర్తుకువచ్చాడని ఆమె పేర్కొన్న విషయం విదితమే. అజాం వ్యాఖ్యలపై ఇప్పుడు తీవ్ర దుమారం రేగుతోంది. అభ్యంతరకర వ్యాఖ్యలపై అజామ్ క్షమాపణలు చెప్పాలంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment