
ఎస్పీ తప్ప ఏ పార్టీలోనైనా చేరతా
షిర్డీ: సమాజ్‌వాదీ పార్టీలోకి తప్ప ఏ పార్టీ ఆహ్వానించినా అందులో చేరతానని సమాజ్‌వాదీ బహిష్కృత నేత, మాజీ ఎంపీ జయప్రద అన్నారు. షిర్డీలో సోమవారం ఆమె మాట్లాడుతూ సమాజ్‌వాదీ పార్టీపై విమర్శలు గుప్పించారు. ఆ పార్టీలో మహిళలకు ఎలాంటి గౌరవ మర్యాదలు లేవన్నారు.
సమాజ్‌వాదీ పాలనలో యూపీ గుండారాజ్‌గా మారిపోయిందన్నారు. అజంఖాన్ వంటి నేతలున్న సమాజ్‌వాదీ పార్టీలో ఎప్పటికీ వెళ్లనని చెప్పారు. మోదీని ఉద్దేశించి అఖిలేశ్ గాడిద అని సంబోధించడం సరికాదన్నారు. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నా.. మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం సరైందని కొనియాడారు.