
సీనియర్ నటి జయప్రదకు అరుదైన గౌరవం లభించింది. ఆమె ఎన్టీఆర్ చలన చిత్ర శతాబ్ది పురస్కారానికి ఎంపికైంది. ఎన్టీఆర్ శతజయంతి మహోత్సవాల సందర్భంగా అవార్డ్ అందకోనున్నారు. ఈనెల 27న ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కార మహోత్సవ సభ జరగనుంది. నందమూరి బాలకృష్ణ, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో ఏడాది పాటు ఎన్టీఆర్ శతజయంతి మహోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఈ ఉత్సవాల్లో భాగంగా తెనాలిలో ప్రముఖ రైటర్ డాక్టర్ సాయి మాధవ్ బుర్ర సభా నిర్వహణలో ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కార గ్రహీత అవార్డును ప్రఖ్యాత సినీ నటి జయప్రద అందుకోనున్నారు. ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ గారి చేతుల మీదుగా ఆమెకు పురస్కారాన్ని అందించబోతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జయప్రకాశ్ నారాయణ, దర్శకుడు కోదండరామిరెడ్డి, ఎన్టీఆర్ అభిమాన సత్కార గ్రహీత డాక్టర్ మైధిలి అబ్బరాజు, మాజీ మంత్రి నెట్టెం రఘురాం పాల్గొననున్నారు.
ఈ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా తెనాలి పెమ్మసాని (రామకృష్ణ) థియేటర్లో ఏడాది పొడవునా ఎన్టీఆర్ చలన చిత్రాలు ప్రదర్శింపబడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈనెల 28న "అడవి రాముడు" సినిమాను ప్రదర్శిస్తునారు. ఈ చిత్రాన్ని నందమూరి రామకృష్ణ, జయప్రద, కోదండరామిరెడ్డి ప్రేక్షకులతో కలిసి చూడనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment