NTR anniversary
-
సీనియర్ నటి జయప్రదకు అరుదైన పురస్కారం
సీనియర్ నటి జయప్రదకు అరుదైన గౌరవం లభించింది. ఆమె ఎన్టీఆర్ చలన చిత్ర శతాబ్ది పురస్కారానికి ఎంపికైంది. ఎన్టీఆర్ శతజయంతి మహోత్సవాల సందర్భంగా అవార్డ్ అందకోనున్నారు. ఈనెల 27న ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కార మహోత్సవ సభ జరగనుంది. నందమూరి బాలకృష్ణ, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో ఏడాది పాటు ఎన్టీఆర్ శతజయంతి మహోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాల్లో భాగంగా తెనాలిలో ప్రముఖ రైటర్ డాక్టర్ సాయి మాధవ్ బుర్ర సభా నిర్వహణలో ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కార గ్రహీత అవార్డును ప్రఖ్యాత సినీ నటి జయప్రద అందుకోనున్నారు. ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ గారి చేతుల మీదుగా ఆమెకు పురస్కారాన్ని అందించబోతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జయప్రకాశ్ నారాయణ, దర్శకుడు కోదండరామిరెడ్డి, ఎన్టీఆర్ అభిమాన సత్కార గ్రహీత డాక్టర్ మైధిలి అబ్బరాజు, మాజీ మంత్రి నెట్టెం రఘురాం పాల్గొననున్నారు. ఈ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా తెనాలి పెమ్మసాని (రామకృష్ణ) థియేటర్లో ఏడాది పొడవునా ఎన్టీఆర్ చలన చిత్రాలు ప్రదర్శింపబడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈనెల 28న "అడవి రాముడు" సినిమాను ప్రదర్శిస్తునారు. ఈ చిత్రాన్ని నందమూరి రామకృష్ణ, జయప్రద, కోదండరామిరెడ్డి ప్రేక్షకులతో కలిసి చూడనున్నారు. -
‘ఈ రోజు నా జీవితంలో ఎంతో విషాదాన్ని నింపింది’
సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, సినీ నటుడు ఎన్టీఆర్ 24వ వర్ధంతి కార్యక్రమం ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం జరిగింది. రవీంద్ర భారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ లలిత కళా పురస్కారాన్ని హాస్యనటుడు బ్రహ్మానందం అందుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతీ మాట్లాడుతూ.. ఈ రోజు తన జీవితంలో ఎంతో విషాదాన్ని నిపిందని.. అది తలుచుకుంటేనే మాటలు రావడం లేదన్నారు. ఎన్టీఆర్ ఓ మహానుభావుడని ఆమె అన్నారు. ఎన్టీఆర్‌పై అభిమానంతో ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతీ ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్ లలిత కళా పురస్కారం అందుకుంటున్న బ్రహ్మానందానికి లక్ష్మీ పార్వతీ అభినందనలు తెలియజేశారు. ఎన్టీఆర్ లలిత కళా పురస్కారాన్ని అందుకున్న అనంతరం బ్రహ్మానందం మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఓ మహానుభావుడని, ఎన్టీఆర్ లలిత కళా పురస్కారానికి తనను ఎంపిక చేశారని తెలిసినప్పుడు భయం వేసిందన్నారు. ఎన్టీఆర్‌తో కలిసి మేజర్ చంద్రకాంత్ సినిమా చేయడం తన పూర్వ జన్మ సుకృతమని ఆనందం వ్యక్తం చేశారు. తనకు ఈ అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన లక్ష్మీ పార్వతికి ధన్యవాదాలు తెలిపారు. సీనియర్‌నటీ జమున మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌కు సంతానం ఉన్నా వారు చేయాల్సిన కార్యక్రమాన్ని లక్ష్మీ పార్వతి నిర్వహించడం గొప్ప విషయమన్నారు. ఎన్టీఆర్ లలితకళా పురస్కారం అందుకున్న బ్రహ్మానందంకు ఆమె అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్ కష్టకాలంలో ఉన్న సమయంలో అండగా ఉండి.. ఎన్టీఆర్‌పై తనకున్న పతిభక్తిని చాటుకున్న లక్ష్మీ పార్వతి అంటే తనకు ఎంతో అభిమానమని అన్నారు. ఎన్టీఆర్ ఓ నటచక్రవర్తి అని, ఆయన పక్కన నటించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఎన్టీఆర్ అంటే ఓ మహానుభావుడని.. కృష్ణుడు సత్యభామ అంటే ఎన్టీఆర్, తానే గుర్తుకు వచ్చేలా నటించామన్నారు. ఎన్టీఆర్ సీఎం అయ్యాక ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారన్నారు. బ్రహ్మానందంకు ఈ అవార్డు ఇవ్వడం తామందరికి గర్వకారణమని అన్నారు. కేవీ రమణాచారి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ నటుడిగా ఎంత గొప్పవారో సీఎంగా కూడా అంతే గొప్పవారని గుర్తు చేశారు. ఎంతో మంది నటుల్ని ఎన్టీఆర్ ప్రోత్సహించారని తెలిపారు. మనుషులు ఎంతో మంది ఉంటారు కానీ, తోటివారి బాగుకోరుకునే కొద్దిమంది మంచివారిలో ఎన్టీఆర్ ఒకరని రమణాచారి అన్నారు. ఎన్టీఆర్ ఓ దైవాంశ సంభూతుడని.. ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే ఇవాళ ఈ అవార్డును బ్రహ్మానందం అందుకున్నారని పేర్కొన్నారు. తెలుగు భాష పట్ల ఎంతో అభిమానం ఉన్న వ్యక్తి బ్రహ్మానందమని చెప్పారు. లక్ష్మీ పార్వతి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్న ఏకైక వ్యక్తి లక్ష్మీ పార్వతి అని ఆర్టీఏ మాజీ కమీషనర్ విజయబాబు అన్నారు. పార్వతికి ఏపీ తెలుగు అకాడమీ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించినందకు ఏపీ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలుగులో నేడు ఎంత పెద్ద హీరో సినిమా అయినా బ్రహ్మానందం ఉండాల్సిందేనని.. ఏ పాత్రనైనా అలవోకగా నటించే సత్తా ఉన్న వ్యక్తి బ్రహ్మానందమని విజయబాబు కొనియాడారు. -
ముందు ఏపీలో జీవో తీసుకురండి
ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహణపై మంత్రి తలసాని సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ లాబీలో మంత్రి తలసాని, టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఎన్టీఆర్ వర్ధంతిని అధికారికంగా నిర్వహించి విశ్వసనీయతను చాటుకోవాల్సిన సమయం వచ్చిందని తలసానిని ఉద్దేశించి సండ్ర వ్యాఖ్యానించగా.. ‘ఎన్టీఆర్ వర్ధంతిని అధికారికంగా జరిపేందుకు ముందు ఏపీలో జీవో తీసుకురండి, తర్వాత ఇక్కడ ఆలోచిద్దాం’ అని తలసాని అన్నారు. దీంతో కార్యక్రమానికి జీవోలుండవని, మౌఖిక ఆదేశాలు మాత్రమే ఉంటాయని రేవంత్ జవాబిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలోనే వర్ధంతిని అధికారికంగా నిర్వహించారని, ఇప్పుడు ఏపీలోనూ నిర్వహిస్తున్నారని వివరించారు. -
‘ఇల్లా’.. మొదలైంది!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఇప్పటికే ముగ్గురు ఆశావహులు.. ఆరు వర్గాలతో కలహాల కుంపటిగా మారిన ఇచ్ఛాపురం టీడీపీలో సరికొత్త చిచ్చు రేగింది. మరో కొత్త ‘ముఖం’ రేసుగుర్రంలా రంగంలోకి దూసుకురావడంతో పరిస్థితి సంక్లిష్టంగా మారింది. ప్రస్తుతం విశాఖలో కాంట్రాక్టరుగా ఉన్న మందస మండలానికి చెందిన ఇల్లా షణ్ముఖరావు ఆశావహుల జాబితాలో చేరడంతో ఇదే స్థానంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బెందాళం వర్గం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎలాగైనా ‘ఇల్లా’ను అడ్డుకోవడానికి ఈ వర్గం హుటాహుటిన రంగంలోకి దిగింది.పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీరామారావు వర్దంతి కార్యక్రమమే బెందాళం, ఇల్లా వర్గాల మధ్య ఆధిపత్య పోరుకు వేదికగా మారి నియోజకవర్గ టీడీపీలో భవిష్యత్ వర్గపోరుకు సంకేతంగా నిలిచాయి. వ్యూహాత్మకంగానే... ఇచ్ఛాపురం రేసులోకి షణ్ముఖరావు హఠాత్తుగా వచ్చినట్టు పైకి కనిపిస్తున్నా, వాస్తవానికి చాలా వ్యూహాత్మంగా పావులు కదిపి తెరపైకి వచ్చారు. ఆయనకు ఓ వైపు గౌతు శివాజీ, మరోవైపు మంత్రి గంటా శ్రీనివాసరావులు వెన్నుదన్నుగా నిలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. మాజీ మంత్రి గౌతు శివాజీ కుటుంబంతో ఇల్లా కుటుంబానికి సుదీర్ఘకాలంగా అనుబం ధం ఉంది. షణ్ముఖరావు తండ్రి గౌతు లచ్చన్నకు అనుయాయుడిగా ఉండేవారు. అనంతర కాలంలో షన్ముఖరావు విశాఖపట్నం పోర్టు కాంట్రాక్టరుగా స్థిరపడి ఆర్థికంగా బలోపేతమయ్యారు. ఇప్పటికీ శివాజీ కుటుం బంతో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నారు. ఎర్రన్నాయుడు హఠాన్మరణానంతర పరిణామాలతో శివాజీ ఇచ్ఛాపురంపై కూడా పట్టు సాధించాలని భావించారు. అందుకే తన సన్నిహితుడైన ఇల్లాను బరిలోకి తేవాలని నిర్ణయించుకున్నారు. అందుకు పంచాయతీ ఎన్నికల్లోనే కార్యాచరణకు ఉపక్రమించారు. షణ్ముఖరావు భార్య సుబ్బలక్ష్మిని తన నియోజకవర్గం పలాస పరిధిలోని మందస మండలం సొండిపూడి సర్పంచుగా గెలిపించారు. తాజాగా ఇచ్ఛాపురం నియోజకవర్గ టీడీపీ నేతల్లో కొందరిని ఇల్లా అనుకూల వర్గంగా కూడగట్టారు. ప్రధానంగా బెందాళం ప్రకాష్‌ను వ్యతిరేకిస్తున్న ఓ సామాజికవర్గ నేతలు ఇల్లా వెన్నంటి నిలిచారు. ఆయన సమకూర్చే వనరులతో నియోజకవర్గంలో తమ వర్గ కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు వారు ఉపక్రమించారు. విశాఖ జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా ఇల్లాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. పోర్టు కాంట్రాక్టు వ్యాపారంలో తనకు సన్నిహితుడైన ఇల్లాను ప్రోత్సహించాలని ఆయన భావిస్తున్నారు. త్వరలో టీడీపీలో చేరునున్న గంటా శ్రీకాకుళం జిల్లాలో కూడా తనకంటూ ఓ వర్గాన్ని కూడగట్టుకుని ఉత్తరాంధ్రలో పట్టుసాధించాలన్న వ్యూహంతో ఉన్నారు. జిల్లా టీడీపీలో పట్టు కోసం శివాజీ, ఉత్తరాంధ్ర టీడీపీలో పట్టు కోసం గంటా ఇచ్ఛాపురంలో ఇల్లాను వ్యూహాత్మకంగా ప్రోత్సహిస్తున్నారని తెలుస్తోంది. బెందాళం వర్గంలో గుబులు తాజా పరిణామాలు టికెట్ రేసులో ఉన్న బెందాళం అశోక్‌కు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. అసలే అధినేత చంద్రబాబు టికెట్టుపై ఇంతవరకు హామీ ఇవ్వలేదు. ఆర్థిక వనరుల అంశాన్ని సాకుగా చూపించి తనను తప్పిస్తారనే భయం ఆయన్ని వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో ఆర్థికంగా స్థితిమంతుడైన ఇల్లా షణ్ముఖరావు రంగంలోకి రావడంతో బెందాళం వర్గం డీలాపడిపోయింది. పైగా శివాజీ, గంటాల మద్దతు ఆయనకు ఉందని తెలియడంతో బెంబేలెత్తిపోతోంది. తాము నమ్ముకున్న కింజరాపు వర్గం ఇచ్ఛాఫురం వ్యవహారాల్లో అంటీముట్టనట్లు వ్యవహరిస్తుండటం వారిని మరింత కుంగదీసింది. ఎన్టీరామారావు వర్ధంతి వేడుకల సందర్భంగా ఇల్లా ఇచ్ఛాఫురంలో కొంత హడావుడి చేయనున్నారని తెలిసి బెందాళం అశోక్ హడలిపోయారు. ఇల్లాను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఇచ్ఛాఫురం పట్టణ టీడీపీ అధ్యక్షుడు కాళ్ల ధర్మారావు తదితరులు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. పేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఈ కార్యక్రమానికి బెందాళం అశోక్‌కు ఆహ్వానం లేదు. అయినప్పటికీ ఇల్లాకు చెక్ పెట్టేందుకు అశోక్ ఆ కార్యక్రమానికి వెళ్లాలని చివరి నిముషంలో నిర్ణయించుకున్నారు. ముందుగా తన వర్గీయులను అక్కడికి పంపించారు. తాను వచ్చేవరకు కార్యక్రమం ప్రారంభించకుండా చూడమని చెప్పారు. అనంతరం అశోక్ అక్కడికి చే రుకుని కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇల్లా, బెందాళం ఒకరితో ఒకరు పోటీపడి మరీ దుప్పట్లు పంపీణీ చేశా రు. కాగా తమ నేత తెచ్చిన దుప్పట్లను అశోక్ పంపిణీ చేయ డంపై ఇల్లా వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేశా రు. అశోక్ ఎంతగా యత్నించినా ఇల్లాను అడ్డుకోలేరని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.