Jaya Prada: సీనియర్ హీరోయిన్ జయప్రద పరిచయం అక్కర్లేని పేరు. ఏపీలోని రాజమండ్రిలో కృష్ణ, నీలవేణి దంపతులకు జన్మించింది. టాలీవుడ్‌తో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం చిత్రాల్లో నటించారు. దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించిన ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. జయప్రద అసలు పేరు లలితా రాణి. భూమి కోసం' సినిమాతో తన కెరీర్‌ను ప్రారంభించిన జయప్రద ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. అప్పటి ప్రముఖ తమిళ దర్శకుడు కె. బాలచందర్ తెరకెక్కించిన అంతులేని కథ చిత్రం ద్వారా ఆమె పేరు జయప్రదగా మారిపోయింది.
అప్పట్లో జయప్రదకు తెలుగులో కంటే హిందీ చిత్రాల్లోనే ఎక్కువ అవకాశాలు వచ్చాయి. తెలుగు , హిందీ భాషల్లో రెండు దశాబ్దాల పాటు స్టార్ హీరోయిన్‌గా రాణించింది. తెలుగు నేలపై పుట్టి బాలీవుడ్‌లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. జితేంద్ర, రిషీ కుమార్ వంటి అగ్ర హీరోలే అప్పట్లో ఆమె డేట్స్ కోసం వేయిట్ చేసే వారంటే ఆమె రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్, కృష్ణ లాంటి దిగ్గజాల సరసన నటించింది. ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసి అక్కడ కూడా దిగ్విజయంగా విజయ యాత్రను కొనసాగించింది. దాదాపు అప్పటి స్టార్ హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్న జయప్రద.. తన వైవాహిక జీవితంలో కష్టాలను అనుభవించింది.
(ఇది చదవండి: సారీ చెప్పిన హీరో లారెన్స్.. ఆ గొడవపై కామెంట్స్!)
నిర్మాత శ్రీకాంత్ నహతాతో ప్రేమ పెళ్లి
జయప్రద ఫేమ్‌లో ఉన్నప్పుడే అప్పట్లో ప్రముఖ నిర్మాత శ్రీకాంత్ నహతాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 22 ఫిబ్రవరి 1986న ముంబైలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లో వీరి పెళ్లి జరిగింది. అయితే శ్రీకాంత్‌కు అప్పటికే పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. మొదటి భార్యతో విడాకులు తీసుకోకుండానే రెండో పెళ్లి చేసుకోవడంతో అప్పట్లో వీరి వివాహం వివాదానికి దారి తీసింది. జయప్రదను పెళ్లాడిన తర్వాత కూడా శ్రీకాంత్ తన మొదటి భార్యతోనే ఉంటున్నాడు. అంతే కాదు శ్రీకాంత్ రెండో పెళ్లి తర్వాత మొదటి భార్య మూడో బిడ్డకు జన్మనిచ్చింది.
ఆత్మహత్యాయత్నం
1990లో జయప్రద విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆ సమయంలో ఆమె బెంగళూరులో నివాసముండేవారు. విషం తాగిన జయప్రదను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అప్పట్లో జయప్రదపై ఆత్మహత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు. శ్రీకాంత్‌తో వివాహమైన తర్వాత మొదటి భార్య చంద్ర తన భర్తను వదిలేయాలని జయప్రదపై ఒత్తిడి తెచ్చింది. అందుకే జయప్రద విషం మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిందన్న వార్త అప్పట్లో వైరలైంది.
అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్నా జయప్రద తన భర్తతో సంతోషంగా జీవితాన్ని గడపలేకపోయింది. కొన్నిసార్లు కలిసినప్పటికీ మొదటి భార్యకు, కుటుంబానికి వారిద్దరూ భయపడేవారట. దీనికి తోడు జయప్రద, శ్రీకాంత్‌లకు సంతానం కలగలేదు. ఆ బాధతో పాటు జయప్రద సంతానం లేదని చాలా బాధపడేది. అందువల్లే తన సోదరి కొడుకు సిద్ధార్థ్‌ను ఆమె దత్తత తీసుకున్నారు.
జీవితమంతా వివాదాలే..
అయితే ప్రస్తుతం జయప్రదకు సినిమాల కంటే రాజకీయాల్లోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. గతంలో ఆమె ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా జయప్రద ఎన్నో వివాదాలను ఎదుర్కొన్నారు. ఆత్మహత్యాయత్నం జరిగిన కొన్నేళ్ల తర్వాత జయప్రదకు సంబంధించిన మార్ఫింగ్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. అప్పుడు కూడా ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు జయప్రద ఇటీవల ఓ కార్యక్రమంలో చెప్పారు. అంతే కాకుండా సమాజ్‌వాదీ పార్టీకి చెందిన అమర్‌సింగ్‌తో జయప్రదకు రిలేషన్ ఉందంటూ రూమర్స్ కూడా వచ్చాయి.
(ఇది చదవండి: పెళ్లికి ముందే పూజలు తెగ చేస్తున్న ఆ హీరోయిన్)
6 నెలల జైలు శిక్ష
2019లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కేసులో ఇటీవలే జయప్రదకు చెన్నైలోని ఎగ్మోర్ కోర్టు జయప్రదకు 6 నెలల జైలు శిక్ష విధించింది. జయప్రద తన సినిమా థియేటర్ల కార్మికుల జీతాల నుంచి ఈఎస్‌ఐ సొమ్మును ఇప్పటికీ చెల్లించలేదని కార్మికులు రాష్ట్ర కార్మిక బీమా శాఖకు ఫిర్యాదు చేశారు. జయప్రద సినీ జీవితంలో సక్సెస్ అయినప్పటికీ.. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఫెయిల్యూర్ అవడం పట్ల ఆమె అభిమానులు బాధపడుతూనే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment