రామ్‌పూర్(యూపీ): గత లోక్‌సభ ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్ బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగినపుడు ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘించిన కేసులో మాజీ ఎంపీ, నటి జయప్రదను అరెస్ట్‌చేయాలని అక్కడి రామ్‌పూర్ కోర్టు పోలీసులను ఆదేశించింది. అరెస్ట్‌చేసి మార్చి నెల ఆరోతేదీన తమ ఎదుట ప్రవేశపెట్టాలని సూచించింది.
2019లో ఎన్నికల ప్రవర్తనానిబంధనావళి ఉల్లంఘనపై కేమారి, స్వార్ పోలీస్‌స్టేషన్లలో జయప్రదపై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసు విషయమై తమ ముందు హాజరుకావాలని ప్రత్యేక ఎంపీ – ఎమ్మెల్యే కోర్టు జయప్రదకు సూచించింది. అయినా ఆమె రాకపోవడంతో ఇప్పటివరకు ఏడుసార్లు నాన్ – బెయిలబుల్ వారెంట్లు జారీఅయ్యాయి. ఇంత జరిగినా ఆమె కోర్టుకు రాకపోవడంతో జయను ‘పరారీలో ఉన్న వ్యక్తి’గా జడ్జి ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment