
'మోదీ పాలన చూసి ఆకర్షితురాలినయ్యా'
న్యూఢిల్లీ: బీజేపీలో చేరే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని మాజీ ఎంపీ జయప్రద ప్రకటించారు. గురువారం న్యూఢిల్లీలో బీజేపీ అధ్యక్షడు అమిషాతో జయప్రద భేటీ అయ్యారు. అనంతరం ఆమె విలేకర్లతో మాట్లాడుతూ.... ప్రధాని మోదీ పాలన చూసి తాను ఆకర్షితురాలినయ్యాయని ఆమె తెలిపారు. పాలనలో మార్పు తీసుకువచ్చే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారని నరేంద్ర మోదీకి ఈ సందర్బంగా జయప్రద కితాబు ఇచ్చారు.