ఎన్టీఆర్ విలువలకు వెన్నుపోటు: జయప్రద | chandrababu Naidu spolils NTR's image | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ విలువలకు వెన్నుపోటు: జయప్రద

Published Wed, Apr 9 2014 2:27 AM | Last Updated on Wed, Sep 5 2018 3:24 PM

ఎన్టీఆర్ విలువలకు వెన్నుపోటు:  జయప్రద - Sakshi

ఎన్టీఆర్ విలువలకు వెన్నుపోటు: జయప్రద

* చంద్రబాబుపై సినీనటి జయుప్రద ఫైర్
* చంద్రబాబును లౌకికవాదులు క్షమించరు : జయప్రద
* నాడు బీజేపీతో పొత్తుపై పశ్చాత్తాపం వ్యక్తం చేసి..
* ఇప్పుడు వుళ్లీ ఆ పార్టీ పంచన చేరుతారా?
* మోడీని చూసి ముస్లింలు భయుపడిపోతున్నారు
వైఎస్ రాజశేఖరరెడ్డి పేదోడి గుండె చప్పుడయ్యారు
* జనం జగన్‌పై పూర్తి విశ్వాసంతో ఉన్నారు.. అధికారంలోకి వచ్చి
* వైఎస్‌లా పని చేయాలని వారు కోరుకుంటున్నారు

 
 తెలుగు, హిందీ సినీ వినీలాకాశంలో మెరిసిన తార జయప్రద. రాజకీయరంగ ప్రవేశం చేసి ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం అజిత్‌సింగ్ ఆధ్వర్యంలోని ఆర్‌ఎల్డీలో చేరి ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మంగళవారంతో అక్కడ ప్రచారం ముగిసిపోయింది. గురువారం (ఈనెల 10న) ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇంతటి బిజీ షెడ్యూల్‌లోనూ ప్రచారం నిర్వహిస్తూ మధ్యమధ్యలో ఆమె ’సాక్షి‘కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు..రాష్ర్ట రాజకీయాలపై  తన మనోగతం ఆమె మాటల్లోనే....
 
 బీజేపీతో పొత్తు దారుణం
 చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం దారుణం. ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం తప్పని గతంలో చెప్పారు. పశ్చాత్తాప పడ్డారు. ఇప్పుడు మళ్లీ పొత్తు పెట్టుకున్నారు. అంటే ఆయన పశ్చాత్తాపానికి అర్థం లేదా? టీడీపీకి ఒక విధానమంటూ లేదా?
 
 మోడీ గాలి ఉత్తదే
 దేశంలో మోడీ గాలి వీస్తోందని అందరూ అంటున్నారు. కానీ అలాంటి పరిస్థితి లేనే లేదు. ముఖ్యంగా దేశ రాజకీయాల్ని ప్రభావితం చేసే ఉత్తరప్రదేశ్‌లో భిన్నమైన సమీకరణాలు ఉన్నాయి. గుజరాత్ రాజకీయాలు వేరు. దేశ రాజకీయాలు వేరు..
 
 పేదోడికి ఆసరా వైఎస్సే..
 వైఎస్ పేరు చెబితే పేదవాడి గుండె కదులుతుంది. ఆయన చేపట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఎంతోమంది పేదలను బతికించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ పేద బిడ్డలకు ఉన్నత చదువులు అందించింది. పెన్షన్ల పథ కం వృద్ధులకు ఆసరా అయింది. ఇలా అనేక పథకాలు పేదలను రక్షించాయి. ఈ సంక్షేమ పథకాల ద్వారా వైఎస్ పేదోడి గుండె చప్పుడు అయ్యారు.
 
జగన్‌లో వైఎస్‌ను చూసుకుంటున్నారు
 జగన్ అధికారంలోకి వస్తే వైఎస్సార్‌లా పని చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. వైఎస్ చేసిన మంచి పనులన్నీ సీమాంధ్రలో జగన్‌కు కలిసి వస్తాయి. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే సీమాంధ్రలో జగన్ సీఎం కావడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జనం జగన్‌లో వైఎస్‌ను చూసుకుంటున్నారు.
 
 బొల్లోజు రవి, ఎలక్షన్ సెల్: చంద్రబాబునాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం దారుణం. గతంలో బీజేపీతో పొత్తుపెట్టుకున్నందుకే అతన్ని నమ్మిన ముస్లింలు చాలా ఇబ్బందులకు గురయ్యారు. అలా పొత్తు పెట్టుకోవడం తప్పని తర్వాత పశ్చాత్తాప పడిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ పొత్తు పెట్టుకోవడం విచారకరం. గతంలో ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు ఆయనే ధిక్కరించారు. తన పశ్చాత్తాపానికి అర్థం లేదా? ఒక విధానమంటూ టీడీపీకి లేదా? ఇలా చేస్తే ప్రజల్లో విశ్వాసం పోతుంది. ఎన్టీఆర్ లౌకికవాది. ఆయన అల్లాను, ఈశ్వరుడినీ కొలిచేవారు. ఆయన స్థాపించిన టీడీపీ ఆశయాలకు, విలువలకు వెన్నుపోటు పొడిచేలా చంద్రబాబునాయుడు వ్యవహరించడం సమంజసం కాదు. ఎన్టీఆర్ ప్రభుత్వం రావడానికి ముందు పాతబస్తీలో నిరంతరం మత ఘర్షణలు జరిగేవి. ఎన్టీఆర్ లౌకికవాది కావడం వల్ల వాటిని ఆపగలిగారు. ఆ తర్వాత చంద్రబాబు వామపక్షాలతో పొత్తు అన్నారు. కానీ బీజేపీ నేతృత్వంలోని వాజ్‌పేయి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి లౌకికవాదానికి తూట్లు పొడిచారు. తర్వాత ఆ పొత్తు తప్పన్నారు. ఇప్పుడు మళ్లీ బీజేపీ పంచన చేరడాన్ని ముస్లింలు క్షమించరు. ఎన్టీఆర్ ఆలోచనలకు చంద్రబాబునాయుడు గౌరవం ఇవ్వాలి.
 
 విభజన విషయంలోనూ...
 చంద్రబాబునాయుడు రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ ఇచ్చారు. తర్వాత ఆయనే అన్యాయంగా రాష్ట్రాన్ని చీల్చారని విమర్శిస్తున్నారు. సీమాంధ్ర, తెలంగాణ విషయంలో ఆయన ద్వంద్వ వైఖరి ప్రదర్శించారు. ఎటుచేసి ముఖ్యమంత్రి కావాలన్నదే ఆయన కల. అందుకే బీజేపీతో పొత్తుపెట్టుకున్నారు. కేంద్రంలో బీజేపీ వస్తుందన్న భ్రమతో పొత్తు పెట్టుకొని లాభపడాలన్నది ఆయన ఉద్దేశం కావచ్చు. కులం, మతం పేరుతో ప్రజలను చీల్చడాన్ని నేను గట్టిగా వ్యతిరేకిస్తాను. అయినా ఆంధ్రలో బీజేపీ ఎక్కడుంది? బీజేపీతో పొత్తు వల్ల టీడీపీకి లాభం కంటే నష్టమే ఎక్కువ. రెండు ప్రాంతాల్లో ఉన్న ముస్లింలు తెలుగుదేశం పార్టీకి దూరం అవుతారు. ఇది టీడీపీకి నష్టం. సీమాంధ్రలోనూ... తెలంగాణలోనూ ముస్లిం ఓట్లు చాలా కీలకం అనేది గుర్తించాలి.
 
 మోడీగాలి ఉత్తదే
::  నరేంద్ర మోడీ బీజేపీ తరపున ప్రధానమంత్రి అభ్యర్థి అయినా ఆ స్థాయికి తగ్గట్లు ఆయన మాట్లాడటం లేదన్న చర్చ ప్రజల్లో జోరుగా సాగుతోంది. ప్రధాని అభ్యర్థి సెక్యులర్ అయి ఉండాలి. దేశ ఆర్థిక అభివృద్ధి, దేశ భవిష్యత్తు, సమగ్రత, సమైక్యత గురించి ఆలోచించాలి. అంతర్జాతీయంగా వివిధ దేశాలతో మన విదేశీ విధానం ఎలా ఉండాలో తెలిసి ఉండాలి.
 
 డాలర్‌కు దీటుగా రూపాయిని ఎలా పటిష్టపరచాలో తెలిసి ఉండాలి. కానీ ఇవన్నీ మోడీలో లేవు. అసలు ఏ ఎజెండాతో వాళ్లు ప్రజల వద్దకు వస్తున్నారు. ముస్లింలపై వారి వైఖరి ఏంటి? అసలు మోడీని చూస్తేనే ముస్లింలు భయపడిపోతున్నారు. ఒకవేళ మోడీ ప్రధాని అయితే తమ భవిష్యత్తు ఎలా ఉంటుందోనని వారు భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తారా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు? దేశంలో మోడీ గాలి వీస్తోందని అందరూ అంటున్నారు. మీడియా ఊదరగొడుతోంది. కానీ అలాంటి పరిస్థితి లేనేలేదు. గుజరాత్ రాజకీయాలు వేరు. దేశ రాజకీయాలు వేరు. ఉత్తరప్రదేశ్‌లో ముస్లిం ఓట్లు కీలకం. ఈ రాష్ట్రంలో ప్రజలంతా మోడీపై మండిపడుతున్నారు. నేను పోటీ చేసే నియోజకవర్గంలో ముజఫర్‌పూర్ కూడా వస్తుంది. అక్కడ ఇటీవల మత అల్లర్లు జరిగాయి. దాని ద్వారా లాభపడేందుకు కొన్ని మతతత్వ శక్తులు ప్రయత్నించాయి.
 
  దాన్ని నేను అడ్డుకోగలిగాను. ముజఫర్‌పూర్‌లో శరణార్థులకు న్యాయం చేసేందుకు పోరాడాను. న్యాయం కోసమే ఇదంతా చేశాను. ధర్మం కోసం పని చేశాను. అటు బీజేపీ, ఇటు సమాజ్‌వాదీ పార్టీ పట్ల ముస్లింలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. నేను తటస్థురాలిని కాబట్టి నాకు ఇక్కడ మంచి స్పందన వస్తోంది. ఇక్కడ మహిళలంతా నా వైపే ఉన్నారు. నాపై పోటీ చేస్తున్న ప్రధాన పార్టీలకు చెందిన మిగతా ముగ్గురు పురుషులు కాబట్టి మహిళలు నన్ను ఆదరిస్తున్నారు. రాంపూర్‌లో నేను చేసిన అభివృద్ధి ఇక్కడ ప్రచారంలో ఉపయోగపడుతోంది. ప్రజలంతా ఆదరిస్తున్నారు.
 
 జగన్‌పై జనం విశ్వాసం
 వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు చెపితే పేదవాడి గుండె కదులుతుంది. ఆయన చేపట్టిన ఆరోగ్యశ్రీ ఎంతోమంది పేదలను బతికించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ పేద బిడ్డలను ఉన్నత చదువులకు తీసుకెళ్లగలిగింది. పెన్షన్ స్కీం వయోవృద్ధులకు ఆసరా అయింది. ఇలా అనేక పథకాలు పేదలను రక్షించాయి. వైఎస్ పేదోడి గుండె చప్పుడు అయ్యారు. తండ్రి పేరును... ఆయన చేపట్టిన పథకాలను జగన్ నెరవేరుస్తారని ప్రజలు పూర్తిస్థాయిలో విశ్వాసంతో ఉన్నారు. జగన్ మీద ఎన్నో బరువు బాధ్యతలు ఉన్నాయి. ఒకవిధంగా తెలియని బరువును ఆయన మోయాల్సి ఉంది. అధికారంలోకి వస్తే వైఎస్సార్‌లా ఆయన పని చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. వైఎస్ చేసిన మంచి పనులన్నీ సీమాంధ్రలో జగన్‌కు కలిసి వస్తాయి. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే సీమాంధ్రలో జగన్ సీఎం కావడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జనం జగన్‌లో వైఎస్‌ను చూసుకుంటున్నారు.
 
 పవన్ కల్యాణ్ రాజకీయ నాయకుడు కాదు...
 పవన్ కల్యాణ్ రాజకీయ నాయకుడు కాదు. పార్టీ పెట్టి నరేంద్రమోడీకి ఎందుకు మద్దతు ఇచ్చాడో అర్థం కావడం లేదు. అలా ఎందుకు ప్రకటించాడో కూడా అంతుబట్టడం లేదు. సినీతారల ప్రచా రం ఓటు రూపం దాల్చడానికి ఏ మేరకు అవకాశం ఉంటుందన్నది సందేహమే. సినీ తారల సభలకు పెద్ద ఎత్తున జనం వస్తారు. అంతమాత్రాన వారు చెప్పిన వారికే ఓటేస్తారన్న నమ్మకం లేదు. మనం ఎంతో మంది మహామహులైన సినీ తారలు ఎలా దెబ్బతిన్నారో చూశాం. పవన్ భవిష్యత్తు రాజకీయం ఎలా ఉంటుందో చూడాలి.
 
 ఆంధ్ర రాజకీయాల్లోకి రావాలనుకున్నా...
 ఈసారి ఆంధ్రప్రదేశ్ నుంచే పోటీ చేద్దామనుకున్నా. కానీ నిర్ణయం తీసుకోవడానికి సమయం చాల్లేదు. అందుకే ఆర్‌ఎల్డీలో చేరి ఇక్కడ్నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నా. ఉత్తరప్రదేశ్‌లో 10 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. ఇక్కడ నాకు బలమైన క్యాడర్ ఉంది. ఇంత తక్కువ సమయంలో మన రాష్ట్రంలోకి వచ్చి క్యాడర్‌ను తయారు చేసుకొని ఎన్నికల్లోకి వెళ్లేందుకు వీలు కుదరదనే ఉత్తరప్రదేశ్ నుంచే మళ్లీ బరిలోకి దిగాను.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement