లక్నో: సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రదను అరెస్టు చేయాలంటూ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఆమెపై ఇదివరకే రెండు కేసులు నమోదు కాగా, ఆమె విచారణకు హాజరు కావడం లేదు. అందుకే ఆమెను అరెస్ట్ చేసి తమ ఎదుట హాజరు పర్చాలని కోర్టు ఆదేశించింది.
జయప్రద 2019 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా తరఫున రాంపూర్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఈ క్రమంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ కౌమరి, స్వార్ పోలీస్ స్టేషన్లలో ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ రెండు కేసులు రాంపూర్ ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్నాయి. అయితే, విచారణలో భాగంగా అనేక సార్లు నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించలేదు.
ఇప్పటివరకు ఏడుసార్లు వారెంట్ జారీ చేసినా, పోలీసులు అరెస్ట్ చేయలేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీంతో న్యాయస్థానం ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణ ఈనెల 27కు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment