సాక్షి, చెన్నై: సీనియర్ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదకు బిగ్ షాక్ తగిలింది. ఆమెకు చెన్నై కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పును వెల్లడించింది. అలాగే, జరిమానా కూడా విధించింది.
వివరాల ప్రకారం.. తమిళనాడులోని ఎగ్మోర్ కోర్టు జయప్రదకు ఆరు నెలలు జైలు శిక్ష విధించింది. అయితే, చెన్నైకి చెందిన రామ్ కుమార్, రాజబాబుతో కలిసి జయప్రద అన్నారోడ్డులో ఓ సినిమా థియేటర్‌ను నడిపించారు. కాగా, ఈ సినిమా థియేటర్‌లో పనిచేసే కార్మికులు నుంచి వసూలు చేసిన ఈఎస్‌ఐ మొత్తాన్ని చెల్లించలేదని కార్మిక బీమా కార్పోరేషన్ కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. అయితే, దీనిపై విచారణ జరిపిన కోర్టు.. జయప్రదతో పాటుగా మరో ముగ్గురికి ఎగ్మోర్ కోర్టు ఆర్నెళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించింది. అలాగే, ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున జరిమానా విధించింది.
ఇదిలా ఉండగా.. జయప్రద తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. ఆమె.. తెలుగు సహా పలు భాషల చిత్రాల్లో నటించారు. రెండు దశాబ్దాల పాటు స్టార్ హీరోయిన్‌గా తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసి అక్కడ కూడా దిగ్విజయంగా విజయ యాత్రను కొనసాగించారు.
நடிகை ஜெயப்பிரதாவுக்கு 6 மாதம் சிறை#JayaPrada | #Jail pic.twitter.com/GKUcmO6ViJ
— Kumudam Reporter (@ReporterKumudam) August 11, 2023
Comments
Please login to add a commentAdd a comment