భార్య కోసం పొర్లుదండాలు.. ప్చ్‌, ఫలించని పూజలు! | Tamil Nadu Lok Sabha Elections 2024: Sarath Kumar Did Anga Pradakshina For Radhika Victory | Sakshi
Sakshi News home page

భార్య గెలుపు కోసం సీనియర్‌ హీరో పొర్లుదండాలు.. ఓటమి దిశగా రాధిక!

Published Tue, Jun 4 2024 1:25 PM

Tamil Nadu Lok Sabha Elections 2024: Sarath Kumar Did Anga Pradakshina For Radhika Victory

2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య తీవ్రస్థాయిలో పోటీ నడుస్తోంది. ఇప్పటివరకు జరిగిన ఓట్ల లెక్కింపు ప్రకారం ఎన్డీయే కూటమి ఆధిక్యంలో ఉంది. మరోసారి నరేంద్రమంత్రి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాలని కోరుకుంటూ సినీ నటుడు శరత్‌కుమార్‌ సోమవారం నాడు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

తమిళనాడులోని విరుదునగర్‌ లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్న తన సతీమణి, నటి రాధిక విజయం సాధించాలని,  అలాగే వారణాసిలో నరేంద్రమోదీ గెలవాలని ఆలయంలో పొర్లుదండాలు పెట్టారు. అనంతరం భార్యతో కలిసి గుడిలో విశేష పూజలు నిర్వహించారు.

ప్రస్తుతం జరుగుతున్న కౌంటింగ్‌లో విరుదునగర్‌లో రాధిక మూడోస్థానానికి పడిపోయారు. విజయప్రభాకరన్‌ (డీఎండీకే), మాణిక్యం ఠాగూర్‌ (కాంగ్రెస్‌)లు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. వీరి మధ్య ఓట్ల తేడా 32గా ఉంది. దీంతో ఈ ఇద్దరిలోనే ఒకరికి గెలుపు తథ్యమని తెలుస్తోంది. రాధిక ఓడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.

 

చదవండి: 100 మార్క్‌ దాటనున్న కాంగ్రెస్‌ : 2014 తరువాత ఇదే తొలిసారి

 

Advertisement
 
Advertisement
 
Advertisement