ఎన్డీయే - ఇండియా కూటమి హోరా హోరీ
2014 తరువాత భారీగా పుంజుకున్న కాంగ్రెస్
100 మార్క్‌కు చేరువలో కాంగ్రెస్
భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ సంచలనం
2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీగా పుంజుకుంది. 2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి, అప్‌కీబార్ 400 పార్‌అంటూ బరిలోకి దిగిన బీజేపీకి భారీ షాకిస్తోంది. 2024 ఎన్నిల్లో ఎన్డీఏ, ఇండియా కూటముల మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతోంది.
స్టార్ క్యాంపెయినర్ కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ 100 మార్క్‌ను దాటే దిశగా దూసుకుపోతోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 227కు పైగా సీట్లలో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఎన్‌డీఏ 292 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
అటు పోటీచేసిన రెండు స్థానాల్లో రాహుల్‌గాంధీ (వాయనాడ్ , రాయబరేలీ) గెలుపుదిశగా పయనిస్తున్నారు. ఒకదశలో వారణాసిలో ప్రధాని మోదీ, తన ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ కంటే 6223 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. అలాగే యూపీలో లోక్ సభ, మహారాష్ట్ర ఫలితాలు సంచలనంగా మారబోతున్నాయి.
2014లో కేవలం 44, 2019 ఎన్నికల్లో 52 సీట్లు గెలుచుకున్నకాంగ్రెస్ 2024లో 100కు పైగా లోక్‌సభ స్థానాలను గెలుచుకునే దిశగా అడుగులు వేస్తోంది. 2009లో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ లీడ్‌గా 206 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే.
2014లో ఏం జరిగింది?
2014లో కాంగ్రెస్ - అప్పుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో 'మోడీ వేవ్' నేపథ్యంలో భారీ పరాజయాన్ని చవిచూసింది, 162 సీట్లు కోల్పోయింది దాదాపు 9.3 శాతం ఓట్లు పడిపోయాయి.
పశ్చిమాన గుజరాత్ , రాజస్థాన్ నుండి తూర్పున బిహార్ , జార్ఖండ్ , మధ్యప్రదేశ్ వరకు హిందీ మాట్లాడే రాష్ట్రాల్లోబీజేపీ క్లీన్ స్విప్ చేసింది. దేశంలోని 543 సీట్లలో 336 సీట్లు గెలుచుకునే మార్గంలో పదేళ్ల క్రితం బీజేపీ ఈ రాష్ట్రాలను క్లీన్ స్వీప్ చేసింది. బీజేపీ సొంతంగా 282 సీట్లు గెలుచుకుంది.
ఎన్డీయే యూపీలో 73, మహారాష్ట్రలో 41, బీహార్‌లో 31, మధ్యప్రదేశ్‌లో 27 సీట్లు గెలుచుకుంది. గుజరాత్‌లోని 26, రాజస్థాన్‌లో 25, ఢిల్లీలో ఏడు, హిమాచల్ ప్రదేశ్‌లో నాలుగు, ఉత్తరాఖండ్‌లో ఐదు స్థానాలను కైవసం చేసుకుంది జార్ఖండ్‌లోని 14లో 12, ఛత్తీస్‌గఢ్‌లోని 11లో 10, హర్యానాలోని 10 సీట్లలో ఏడు గెలుచుకుంది.
2019లో ఏం జరిగింది?
బీజేపీ సొంతంగా 303 సీట్లు, మిత్రపక్షాలతో కలిసి 353 సీట్లు గెలుచుకుంది. యూపీలో 74, బీహార్‌లో 39, మధ్యప్రదేశ్‌లో 28 స్థానాలు కైవసం చేసుకోవడంతో మరోసారి హిందీ బెల్ట్ కాంగ్రెస్ ఆశలను దెబ్బతీసింది. గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ,ఢిల్లీలో కూడా 77 స్థానాలను గెలుచుకుంది. ఛత్తీస్‌గఢ్‌లో తొమ్మిది, జార్ఖండ్‌లో 11 స్థానాలను కలుపుకుంటే బీజేపీ ఈ బెల్ట్‌లో 238 సీట్లు సాధించింది. 2019లో అమేథీ నియోజకవర్గం బీజేపీ స్మృతి ఇరానీ చేతిలో ఘోరంగా ఓటమిని చవిచూశారు రాహుల్‌గాంధీ.
Comments
Please login to add a commentAdd a comment