కోలీవుడ్ స్టార్ అజిత్ నటనతో పాటు ఇతర రంగాల్లోనూ ఆసక్తి చూపుతున్న విషయం తెలిసిందే. ఈయన గతంలో రైఫిల్ షూట్ విన్ అయ్యారు. బైక్ రైడింగ్‌లో పాల్గొంటూ ప్రపంచ యాత్ర చేస్తున్నారు. అదే విధంగా ఏరోనాటికల్ రంగంలోనూ ఆసక్తి కలిగి ఉన్నారు. చైన్నె ఎంఐటీ విశ్వవిద్యాలయం విద్యార్థులకు ఆయన సలహదారుడిగా ఉన్నారు. ఈయన నేతృత్వంలో ఏరోనాటికల్ విద్యార్థుల బృందం డ్రోన్‌లను తయారు చేస్తోంది.
గత కరోనా కాలంలో వీరు తయారు చేసిన డ్రోన్‌లు ప్రభుత్వ సేవలకు ఉపయోగపడ్డాయి. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. అజిత్ సలహదారుడిగా వ్యవహరించిన దక్ష టీమ్ 2018లో ఆస్ట్రేలియాలో జరిగిన అంతర్జాతీయ డ్రోన్‌ల పోటీల్లో పాల్గొని అవార్డులను గెలుచుకుంది. తాజాగా ఈ టీమ్‌తో ఇండియన్ ఆర్మీ డీల్ కుదుర్చుకుంది. 200 డ్రోన్లు తయారు చేసివ్వమంటూ రూ.165 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది.
అజిత్ సినిమాల విషయానికి వస్తే ఆయన చివరగా తునివు(తెలుగులో తెగింపు) చిత్రంలో నటించారు. విడాముయర్చి సినిమాకు సంతకం చేసిన ఆయన తన బైక్ టూర్ ముగియగానే షూటింగ్‌లో పాల్గొననున్నారు. అనిరుధ్ రవించందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా త్రిష హీరోయిన్‌గా నటించనున్నట్లు సమాచారం. అర్జున్, అర్జున్ దాస్ కూడా ఈ చిత్రంలో భాగమవుతున్నట్లు తెలుస్తోంది.
#AK's passion once again benefits the nation - The #AjithKumar mentored #Daksha team has got the order to supply 200 drones worth 165 crore rupees to the Indian Army in the next 12 months 👏#Ajithkumar #VidaaMuyarchi pic.twitter.com/fZVIQR5bwj
— KERALA AJITH FANS CLUB (@KeralaAjithFc) August 8, 2023
చదవండి: జైలర్ సినిమా రివ్యూ
Comments
Please login to add a commentAdd a comment