మోడరన్ క్వీన్! | Jaya Prada to make Bollywood comeback with paranormal | Sakshi
Sakshi News home page

మోడరన్ క్వీన్!

Published Mon, May 4 2015 11:17 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

మోడరన్ క్వీన్! - Sakshi

మోడరన్ క్వీన్!

 రాణి పాత్రలు చేయాలంటే అందుకు తగ్గట్టు అందం ఉండాలి. ఎంత అందంగా అంటే.. అచ్చంగా జయప్రదలా అనొచ్చు. ఫిఫ్టీ ప్లస్ ఏజ్‌లోనూ తరగని అందంతో తళుకులీనుతుంటారు జయప్రద. అందుకే, ఆమెను రాణి పాత్రకు తీసుకున్నారు సంజయ్ శర్మ. ఇంకా పేరు ఖరారు కాని ఓ హిందీ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారాయన. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో ‘మోడరన్ క్వీన్’ పాత్రకు జయప్రదను తీసుకున్నారు.
 
 ఇది లీడ్ రోల్. ఇప్పటివరకూ ఇలాంటి పాత్ర చేయలేదని జయప్రద అంటున్నారు. రాణి సాహిబా పాత్రను సవాల్‌గా తీసుకున్నానని ఆమె పేర్కొన్నారు. దర్శకుని మీద నమ్మకంతో ఈ సినిమా అంగీకరించానని కూడా అన్నారు. కంగనా రనౌత్ నటించిన ‘రజ్జో’లో ఓ పాత్ర చేసిన జయప్రద, మళ్లీ రెండేళ్ల తర్వాత హిందీలో అంగీకరించిన చిత్రం ఇదే!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement