సమస్యలపై కానిస్టేబుల్‌ పోరాటం | R narayana murthy in sankranthi race | Sakshi
Sakshi News home page

సమస్యలపై కానిస్టేబుల్‌ పోరాటం

Published Wed, Jan 4 2017 12:56 AM | Last Updated on Tue, Sep 5 2017 12:19 AM

సమస్యలపై కానిస్టేబుల్‌ పోరాటం

సమస్యలపై కానిస్టేబుల్‌ పోరాటం

సమాజంలో జరుగుతున్న సమస్యలపై పోరాడే పాత్రల్లో పీపుల్స్‌ స్టార్‌ ఆర్‌. నారాయణమూర్తిని సోలోగా చూస్తుంటాం. అయితే, ఈ సారి ఆయన రొటీన్‌కు భిన్నంగా హీరోయిన్‌తో.. అదీ సహజనటి జయసుధతో స్టెప్పులేస్తే ఎలా ఉంటుంది? ఊహిస్తేనే సినిమా ఎప్పుడు చూద్దామా? అని ఆత్రుతగా ఉంది కదూ. అయితే.. మీరు సంక్రాంతి వరకూ ఆగాల్సిందే. నారాయణమూర్తి, జయసుధ ముఖ్యపాత్రల్లో చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో చదలవాడ పద్మావతి నిర్మించిన ‘హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకట్రామయ్య’ పోస్ట్‌ ప్రొడక్షన్‌ జరపుకొంటోంది. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘నిజాయతీ పరుడైన హెడ్‌ కానిస్టేబుల్‌ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? వాటిని ఎలా అధిగమించాడన్నదే కథ. నారాయణమూర్తి, జయసుధ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

ఈ వారంలో పాటలు, సంక్రాంతికి సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘సమాజంలోని ప్రధాన సమస్య ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఆ సమస్య ఏంటన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. నా గత చిత్రాలకంటే ఇందులో వైవిధ్యంగా కనిపిస్తా. మా చిత్రం చూసి ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తారు’’ అని నారాయణమూర్తి చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ‘వందేమాతరం’ శ్రీనివాస్, కెమెరా: కె.సుధాకర్‌రెడ్డి, సమర్పణ: చదలవాడ తిరుపతిరావు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement