
కంచిలి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యను ప్రవేశపెట్టి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. బీఆర్ అంబేడ్కర్ ఆశయాలను నిజం చేస్తున్నారని ప్రముఖ సినీనటుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం బూరగాం గ్రామంలో నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆయన ఆదివారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేదలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారని అభినందించారు. కేంద్రంలోని బీజేపీ పాలకులు ప్రభుత్వ రంగ సంస్థలైన రోడ్లు, రైల్వేలు, విమాన సర్విసులు, ఎల్‌ఐసీ, బ్యాంకింగ్ తదితర సెక్టార్లను ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు.
చివరికి ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను కూడా ప్రైవేటీకరణ చేయడానికి ఉపక్రమించడం దారుణమని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రజాకవి, సినీ గేయ రచయిత జయరాజు, విశ్రాంత ఐఏఎస్ పి.ఎస్.ఎన్. మూర్తి పాల్గొన్నారు.