జోడీ కుదిరింది! | R Narayana Murthy Head Constable Venkatramayya launch on october 19th | Sakshi
Sakshi News home page

జోడీ కుదిరింది!

Published Sun, Oct 16 2016 11:12 PM | Last Updated on Mon, Sep 4 2017 5:25 PM

జోడీ కుదిరింది!

జోడీ కుదిరింది!

పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి, సహజ నటి జయసుధ జంటగా  ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ అనే చిత్రం రూపొందనుంది. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రం ద్వారా నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు దర్శకునిగా మారుతున్నారు. చదలవాడ తిరుపతిరావు సమర్పణలో చదలవాడ పద్మావతి నిర్మించనున్న ఈ సినిమా ఈ నెల 19న ప్రారంభం కానుంది. ‘‘నా అభిమాన నటి  సావిత్రిగారు. ఆమె తర్వాత నేను అభిమానించే నటి జయసుధగారు.

 అటువంటి గొప్ప నటితో కలిసి నేను మొదటిసారి నటిస్తున్నానంటే చాలా హ్యాపీగా, థ్రిల్‌గా ఉంది. నాతో నటించేందుకు ఒప్పుకున్న జయసుధగారికి, ఈ అవకాశం ఇచ్చిన దర్శక-నిర్మాతలకు థ్యాంక్స్’’ అని నారాయణమూర్తి అన్నారు.  దర్శకుడు మాట్లాడుతూ- ‘‘నీతి, నిజాయితీ ఉన్న ఓ పోలీసు నిజ జీవితంలో, వృత్తిలో ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? వాటిని ఎలా అధిగమించాడన్నది కథాంశం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ‘వందేమాతరం’ శ్రీనివాస్, కెమెరా: సుధాకర్ రెడ్డి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement