సమాజానికి ఉపయోగపడే సినిమా ఇది | Head Constable venkatramaiah audio cd released | Sakshi
Sakshi News home page

సమాజానికి ఉపయోగపడే సినిమా ఇది

Published Tue, Jan 10 2017 12:02 AM | Last Updated on Fri, Jul 12 2019 4:40 PM

సమాజానికి ఉపయోగపడే సినిమా ఇది - Sakshi

సమాజానికి ఉపయోగపడే సినిమా ఇది

 – చదలవాడ శ్రీనివాసరావు

‘‘నేను దర్శకత్వం వహించిన మొదటి సినిమా ఇది. అవుట్‌పుట్‌ సంతృప్తికరంగా వచ్చింది. నారాయణమూర్తి, జయసుధ సీనియర్‌ ఆర్టిస్టులు అయినప్పటికీ స్టూడెంట్స్‌లా నేను చెప్పినట్లు చేశారు. మంచి కథాంశంతో తీసిన ఈ సినిమా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది’’ అని చదలవాడ శ్రీనివాసరావు అన్నారు. ఆర్‌. నారాయణమూర్తి, జయసుధ జంటగా ఆయన దర్శకత్వం వహించిన ‘హెడ్‌కానిస్టేబుల్‌ వెంకట్రామయ్య’ ఈ నెల 14న విడుదల కానుంది.

చదలవాడ పద్మావతి నిర్మించిన ఈ చిత్రం ఆడియో వేడుక సోమవారం జరిగింది. ఎస్‌.పి. నాయక్‌ ఆడియో సీడీని ఆవిష్కరించి, జయసుధకు ఇచ్చారు. ఆర్‌. నారాయణమూర్తి మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రంలో ఒక సీన్‌లో నేను జయసుధ బుగ్గ మీద కొట్టాలి. దర్శకుడు ఈ సీన్‌ గురించి చెప్పగానే, వెనకాడాను. నా చెయ్యేమో రఫ్‌. ఆమె బుగ్గ కందిపోతుందని నా భయం. చివరికి ఆవిడే ‘ఫరవాలేదండి’ అన్నారు. జయసుధ అప్పుడు ఎన్టీఆర్‌ పక్కనా నటించారు. ఇప్పుడు నారాయణమూర్తి పక్కనా నటించారు. సినిమాని సినిమాలా చూసే మహాతల్లి ఆమె’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement