
విగ్గు కాదు...
నలుగురు సినిమావాళ్లు కలుసుకుంటే వారి మధ్య సినిమా మాటలు, షూటింగ్‌ల ముచ్చట్లే దొర్లుతాయి. ఇక పాతతరం నటులైతే అలనాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూనే ఉంటారు. నిన్నటితరం సినీతారలు మురళీమోహన్, జయసుధ శనివారం మాదాపూర్ ‘లామార్స్ హెయిర్ సొల్యూషన్‌స’ ప్రారంభోత్సవంలో కలుసుకున్నప్పుడు వారి మధ్య ఇలాంటి సంభాషణే సాగింది. పాత సినిమాల్లో తాము విగ్గు ధరించిన సందర్భాలు, అవతలి వారికి అసలైన జుట్టో, విగ్గో తెలియక తికమక పడ్డ సరదా జ్ఞాపకాలను వారు గుర్తుచేసుకున్నారు.