M M Keeravani
-
Premalu Movie: ‘ప్రేమలు’ సినిమా సక్సెస్‌మీట్ (ఫొటోలు)
-
మరో టాలెంట్‌ను పరిచయం చేసిన ఫేస్బుక్
-
‘ఎవ్వడంట... ఎవ్వడంట’ మాటల్లేవ్ బాస్
సోషల్ మీడియా వల్ల లోకల్ టాలెంట్ వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే బేబీ, రాణు మరియా ముండల్ అనే యాచకురాలి ప్రతిభను వెలుగులోకి తెచ్చిన సోషల్‌మీడియా ప్రస్తుతం మరో నూతన గాత్రాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ గానం మనసుల్ని రంజింపచేస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. హేము గమేతి భిల్ అనే ఫేస్బుక్ అకౌంట్లో షేర్ చేసిన ఈ వీడియోలో ఓ యువకుడు భారతీయ సినీ రికార్డులను తిరగరాసిన ‘బాహుబలి: ది బిగినింగ్’ చిత్రంలోని ఎవ్వడంట.. ఎవ్వడంట హిందీ వెర్షన్(కౌన్ హై ఓ)ను పాటను అద్భుతంగా పాడాడు. అయితే ఈ పాట పాడిన వ్యక్తి వివరాలేం తెలియవు. బాహుబలి చిత్రంలో ఎంఎం కీరవాణి స్వరపర్చిన ఈ పాటను సదరు వ్యక్తి అంతే హృద్యంగా పాడి నెటిజనుల మనసు గెలుచుకున్నాడు. ఈ వీడియో చూసిన వారంతా మాటలు లేవు అంటూ ప్రశంసిస్తున్నారు. -
స్ఫూర్తి నింపేలా...
కరోనా వైరస్ గురించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి పాటలు సిద్ధం చేస్తున్నారు మన సంగీత దర్శకులు. కోటి ‘‘లెటజ్ ఫైట్ కరోనా..’’ అంటూ వీడియో సాంగ్ విడుదల చేస్తే, యం.యం. కీరవాణి, వందేమాతరం శ్రీనివాస్ కూడా స్ఫూర్తి నింపే పాటలను కంపోజ్ చేసి, ఆడియోను విడుదల చేశారు. ‘వియ్ విల్ స్టే ఎట్ హోమ్’ అనే పాటను కీరవాణి స్వయంగా రాసి, ట్యూన్ చేసి ఆలపించారు. ఈ పాట కోసం ఆయన గతంలో ‘స్టూడెంట్ నెం. 1’ సినిమాకి కంపోజ్ చేసిన ‘ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి’ పాట ట్యూన్‌నే మళ్లీ తీసుకున్నారు. వందేమాతరం శ్రీనివాస్ ట్యూన్ చేసి, పాడిన ‘కరోనా కరోనా నీతో యుద్ధం చేస్తాం..’ పాటను నిజార్ రచించారు. -
అఖిలాండ కోటి..వీడియో సాంగ్ హల్చల్
హైదరాబాద్: టాలీవుడ్ అగ్రహీరో నాగార్జున లీడ్ రోల్ పోషించిన ప్రతిష్టాత్మక ప్రాజక్టు ఓం నమో వెంకేటేశాయ మూవీలో తొలి వీడియో సాంగ్ విడుదలైంది. స్టార్ దర్శకుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలోని ‘అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా’ పూర్తి వీడియో సాంగ్‌ను లహరి మ్యూజిక్ యూ ట్యూబ్ లో రిలీజ్ చేసింది. దీంతో నాగ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. శరత్ సంతోష్, శ్రీనిధి ఆలపించిన ఈ సాంగ్ అందరినీ అలరిస్తోంది. అలాగే అన్నమయ్యతో అలరించిన నాగ్.. హథీరాం బాబాగా మరోసారి పౌరాణిక పాత్రలో మరింత ఎలివేట్ అయ్యారన్న కమెంట్లు వెల్లువెత్తుతున్నాయి. కాగా అక్కినేని నాగార్జున.. కె.రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో వస్తున్న మూవీ ఓం నమో వెంకేటేశాయలో వెంకటేశ్వరుని పరమ భక్తుడైన హథీరాం బాబాగా నాగార్జున నటించగా, కృష్ణమ్మగా అనుష్క శెట్టి, ప్రగ్యా జైస్వాల్ మరో కీ రోల్ పోషించారు. జగపతి బాబు ఈ చిత్రంలో సప్తగిరుల ప్రాంతాన్ని పరిపాలించిన రాజుగా కనిపిస్తుండగా , ఎంఎం కీరవాణి సంగీత సారధ్యం వహించారు. హథీరాంబాబా జీవిత కథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ రేపే (ఫిబ్రవరి 10) థియేటర్లను పలకరించనున్న సంగతి తెలిసిందే. -
'ఏమో గుర్రం ఎగరావచ్చు' ఆడియో