సోషల్ మీడియా వల్ల లోకల్ టాలెంట్ వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే బేబీ, రాణు మరియా ముండల్ అనే యాచకురాలి ప్రతిభను వెలుగులోకి తెచ్చిన సోషల్‌మీడియా ప్రస్తుతం మరో నూతన గాత్రాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ గానం మనసుల్ని రంజింపచేస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. హేము గమేతి భిల్ అనే ఫేస్‌బుక్ అకౌంట్లో షేర్ చేసిన ఈ వీడియోలో ఓ యువకుడు భారతీయ సినీ రికార్డులను తిరగరాసిన ‘బాహుబలి: ది బిగినింగ్’ చిత్రంలోని ఎవ్వడంట.. ఎవ్వడంట హిందీ వెర్షన్(కౌన్ హై ఓ)ను పాటను అద్భుతంగా పాడాడు. అయితే ఈ పాట పాడిన వ్యక్తి వివరాలేం తెలియవు. బాహుబలి చిత్రంలో ఎంఎం కీరవాణి స్వరపర్చిన ఈ పాటను సదరు వ్యక్తి అంతే హృద్యంగా పాడి నెటిజనుల మనసు గెలుచుకున్నాడు. ఈ వీడియో చూసిన వారంతా మాటలు లేవు అంటూ ప్రశంసిస్తున్నారు.
వైరల్ వీడియో: మరో టాలెంట్‌ను పరిచయం చేసిన ఫేస్‌బుక్
Published Wed, May 27 2020 11:02 AM | Last Updated on Wed, May 27 2020 11:45 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment