అఖిలాండ కోటి..వీడియో సాంగ్ హల్‌చల్‌ | Akhilanda Koti Full Video Song | Om Namo Venkatesaya - Nagarjuna, Anushka Shetty, M M Keeravani | Sakshi
Sakshi News home page

అఖిలాండ కోటి..వీడియో సాంగ్ హల్‌చల్‌

Published Thu, Feb 9 2017 12:56 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

అఖిలాండ కోటి..వీడియో సాంగ్ హల్‌చల్‌ - Sakshi

అఖిలాండ కోటి..వీడియో సాంగ్ హల్‌చల్‌

హైదరాబాద్‌: టాలీవుడ్ అగ్రహీరో నాగార్జున లీడ్ రోల్‌   పోషించిన  ప్రతిష్టాత్మక ప్రాజక్టు  ఓం నమో వెంకేటేశాయ మూవీలో  తొలి  వీడియో సాంగ్   విడుదలైంది.  స్టార్‌ దర్శకుడు  కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలోని ‘అఖిలాండ కోటి   బ్రహ్మాండ నాయకా​’  పూర్తి వీడియో  సాంగ్‌ను  లహరి మ్యూజిక్  యూ ట్యూబ్ లో రిలీజ్ చేసింది.  దీంతో నాగ్‌ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.  శరత్ సంతోష్, శ్రీనిధి  ఆలపించిన ఈ సాంగ్ అందరినీ  అలరిస్తోంది.  అలాగే అన్నమయ్యతో అలరించిన నాగ్‌.. హథీరాం బాబాగా   మరోసారి పౌరాణిక  పాత్రలో మరింత  ఎలివేట్ అయ్యారన్న కమెంట్లు వెల్లువెత్తుతున్నాయి.  

కాగా  అక్కినేని నాగార్జున.. కె.రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో వస్తున్న మూవీ ఓం నమో వెంకేటేశాయలో వెంకటేశ్వరుని పరమ భక్తుడైన హథీరాం బాబాగా నాగార్జున నటించగా, కృష్ణమ్మగా  అనుష్క శెట్టి,  ప్రగ్యా జైస్వాల్ మరో కీ రోల్‌  పోషించారు. జగపతి బాబు ఈ చిత్రంలో సప్తగిరుల ప్రాంతాన్ని పరిపాలించిన రాజుగా కనిపిస్తుండగా , ఎంఎం కీరవాణి సంగీత సారధ్యం వహించారు. హథీరాంబాబా జీవిత కథ నేపథ్యంలో  తెరకెక్కిన  ఈ మూవీ  రేపే (ఫిబ్రవరి 10) థియేటర్లను పలకరించనున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement