Mahesh Babu Sarkaru Vaari Paata Movie Complete Shoot Except A Song: సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో 'మహానటి' కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్‌తోపాటు కళావతి, ఎవ్రీ పెన్నీ సాంగ్స్‌కు విశేష ప్రేక్షకదారణ లభించింది. తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ఈ వార్తతో మహేశ్ అభిమానులకు పండగే అని చెప్పవచ్చు. ఆ వార్త ఏంటంటే ఈ సినిమా షూటింగ్ గురించి మేకర్స్ అప్‌డేట్ ఇచ్చారు.
''సర్కారు వారి పాట' చిత్రీకరణ దాదాపు పూర్తయింది. కేవలం ఒకే పాటను షూట్ చేయాల్సి ఉంది.' అని చిత్రబృందం తెలిపింది. దీంతో అభిమానులు సంబరపడిపోతున్నారు. ఎందుకంటే ఒక పాట చిత్రీకరిస్తే సినిమా అనుకున్న సమయానికే విడుదలవుతుంది కాబట్టి. వేసవి కానుకగా మే 12న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
చదవండి: మహేశ్ బాబు చిత్రంలో తమిళ స్టార్ హీరో.. క్లారిటీ!
#SarkaruVaariPaata completes shoot except for a song!
— Mythri Movie Makers (@MythriOfficial) April 12, 2022#
Get ready for exciting updates 💥#SVPManiaBegins 🔥#SVPOnMay12
Super 🌟 @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @madhie1 @MusicThaman @14ReelsPlus @GMBents @saregamasouth pic.twitter.com/qK4tYD0h6d
Comments
Please login to add a commentAdd a comment