విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా గీత గోవిందం. ఇటీవల విడుదలైన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ రావటంతో చిత్రయూనిట్ సంబరాలు చేసుకుంటున్నారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించిన సినిమాకు పరశురామ్ దర్శకుడు. గతంలో ఇదే బ్యానర్‌లో శ్రీరస్తు శుభమస్తు లాంటి డీసెంట్ హిట్ ఇచ్చిన పరశురామ్ తన తదుపరి చిత్రాన్ని కూడా గీతా ఆర్ట్స్ బ్యానర్‌లోనే చేయనున్నారట.
మరోసారి మెగా హీరోతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు పరశురామ్. ఇప్పటికే వరుణ్ తేజ్ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమాను నిర్మించేందుకు గీతా ఆర్ట్స్ రెడీ అవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వరుణ్ కోసం పరశురామ్ కథ రెడీ చేసే పనిలో ఉన్నాడట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment