Rashi Khanna, Shruti Hassan and Other Heroines Who Give Up Hit Films - Sakshi
Sakshi News home page

గీత గోవిందం, బాహుబలి, రంగస్థలం లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాలు వదులుకున్న హీరోయిన్స్‌ వీళ్లే

Published Tue, Feb 28 2023 11:57 AM | Last Updated on Tue, Feb 28 2023 12:37 PM

Rashi Khanna, Shruti Hassan, Other Heroines Who Given up Hit Films - Sakshi

ఫిల్మ్ ఇండస్ట్రీలో టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి. మూవీ ఆఫర్స్ టాలెంట్ తోనే కాదు...అదృష్టం వల్ల కూడా వరిస్తాయి. అలా అదృష్టం కారణాంగా గోల్డెన్ ఛాన్స్ అందుకుని సూపర్ హిట్స్ అందుకున్న హీరోయన్స్ చాలా మందే ఉన్నారు. అలాగే కాల్షీట్స్ సర్ధుబాటు చేయలేక గోల్డెన్ ఆఫర్స్ మిస్ చేసుకున్న హీరోయిన్స్ లిస్ట్ కూడా పెద్దదే.. ఇండస్ట్రీ హిట్స్ సాధించిన సినిమాల్లో హీరోయిన్ ఛాన్స్ ముందుగా మరోకరిని పలకరించింది. ఆ భామలు నో చెప్పటంతో...ఈ హీరోయిన్స్ కి ఆఫర్ కాదు..ఏకంగా బంపరాఫర్‌ తగిలింది. 

2018 లో విడుదలై బాక్సాపీస్ దగ్గర సరికొత్త రికార్డ్స్ సృష్టించిన సినిమా గీత గోవిందం..ఈ సినిమాలో రౌడీ బాయ్ విజయ్‌ దేవరకొండ, నేషనల్ క్రష్‌ రష్మిక మందన్న హీరో, హీరోయిన్స్ గా నటించారు. రూ.5 కోట్ల తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దాదాపు 130 కోట్లు వసూళ్లు చేసింది. ఇక గీత గోవిందం సక్సెస్ తో హీరోయిన్ గా రష్మిక ఇమేజ్ టోటల్ గా మారిపోయింది. ఈ ఒక సినిమాతో టాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ దక్కించుకుంది.

అసలు గీతగోవిందం సినిమాకి ముందుగా మూవీ మేకర్స్ రష్మిక మందన్న అనుకోలేదట. విజయ్ దేవర కొండకి జోడిగా రాశీ ఖన్నా అనుకున్నారు. అయితే డేట్స్ అడ్జెస్ట్ కాకపోవటంతో రాశీ ఖన్నా గీత గోవిందం వదులుకోవాల్సి వచ్చింది. దీంతో ఈ ఆఫర్ రష్మిక మందన్న దగ్గరకి వెళ్లింది. రాశీఖన్నా గీత గోవిందం సినిమా ఒక్కటే కాదు...2019లో విడుదలైన సూపర్ హిట్ మూవీ ఎఫ్2 లో హీరోయిన్ ఛాన్స్ కూడా వదులుకుంది. ఎఫ్‌2 సినిమాలో తమన్నా రోల్ కి ముందుగా రాశీ ఖన్నా అనుకున్నారు. అయితే ఆ రోల్ రాశీ ఖన్నా చేయటానికి ఇంట్రెస్ట్ చూపించక మిస్ చేసుకుంది.

ఇక లెక్కల మాస్టారు సుకుమార్ తెరకెక్కించిన చిత్రం రంగస్థలం..ఈ సినిమాలో సమంత కంటే ముందు అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్‌గా తీసుకోవాలనుకున్నాడు డైరెక్టర్ సుకుమార్. అనుపమ ఇంకా అమ్మ కూచి అని ఫీలైన సుకుమార్ సమంతను ఫైనల్ చేశాడు. అలా అనుపమ రంగస్థలం లో హీరోయిన్ ఛాన్స్ మిస్ అయింది. ఈ సినిమాలో హీరోయిన్ పల్లెటూరి అమ్మాయి అయినా కాస్త గ్లామర్ గా కనిపిస్తది.

అలాగే దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన జానపద చిత్రం బాహుబలి...ఈ సినిమాలో తమన్నా క్యారెక్టర్ కి ముందుగా సోనం కపూర్ అనుకున్నారట. సోనమ్ కపూర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవటంతో ఆ ఛాన్స్ తమన్నా అందుకుంది. ఇలాగే హీరో నాని జెర్సీ, సూపర్ స్టార్ మహేష్ బాబు బిజినెస్ మేన్ సినిమాల్లో హీరోయిన్ ఆఫర్ శృతిహాసన్ డేట్స్ అడ్జెస్ట్ చేయలేక మిస్ చేసుకుంది.


ఇక అర్జున్ రెడ్డి సినిమాలో ప్రీతి పాత్ర కోసం శాలిని పాండే కంటే ముందు మలయాళనటి పార్వతీ నాయర్ అనుకున్నారు. ఆ పాత్ర కాస్త బోల్డ్ ఉండటంతో ఆ బ్యూటీ వెనకడుగు వేసింది. అలాగే కుమారి 21ఎఫ్ మూవీ లో హీరోయిన్ గా హెబ్బా పటేల్ కంటే ముందు చాందిని చౌదరి అనుకున్నారు. ఆ బోల్డ్ క్యారెక్టర్ చేయటం ఇష్టం లేక చాందిని ఆ మూవీ ఆఫర్ వదలుకుంది. . కానీ కుమారి 21 ఎఫ్‌ తో హెబ్బా పటేల్ కు మంచి గుర్తింపు లభించింది., ఇక డేట్స్ అడ్జెస్ట్ చేయలేక...క్యారెక్టర్స్ నచ్చక చాలా మంది హీరోయిన్స్ సూపర్ హిట్ మూవీస్ ఛాన్స్ మిస్ చేసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement