
విజయ్ దేవరకొండ, రష్మికా మండన్న
ఇందు మూలంగా యావన్మంది ప్రేక్షక లోకానికి తెలియచేయడం ఏమనగా.. ‘గీత గోవిందం’ ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు వస్తున్నారహో. ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్ విజయ్ దేవరకొండ, ‘ఛలో’ ఫేమ్ రష్మికా మండన్న జంటగా తెరకెక్కిన చిత్రం ‘గీత గోవిందం’. పరశురాం దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో జిఏ2 పిక్చర్స్ పతాకంపై ‘బన్ని’ వాసు నిర్మించారు. ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది. ఈ నెల 15న సినిమా విడుదల చేస్తున్నారు. అల్లు అరవింద్ మాట్లాడూతూ– ‘‘పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. ఈ చిత్రంలో లుక్ దగ్గర నుంచి పాత్ర వరకూ విజయ్ అందర్నీ ఆకట్టుకుంటాడు.
పరశురాం దర్శకుడిగా మరో మెట్టు ఎక్కాడు. గీత పాత్రలో రష్మిక అద్భుతంగా నటించారు’’ అన్నారు. ‘‘గీతా ఆర్ట్స్‌లో నేను చేసిన ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రం మంచి మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. ‘గీత గోవిందం’ కూడా ఇప్పటికే మ్యూజిక్ లవర్స్‌ని ఆకట్టుకుంటోంది. గోపీసుందర్ పాటలు సూపర్ హిట్ కావటం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు పరశురాం. ‘‘విజయ్ సూపర్ ఫెర్‌ఫార్మెన్స్‌తో మరోసారి ప్రేక్షకులను తనవైపుకు తిప్పుకుంటాడనే నమ్మకం ఉంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌ని తెరకెక్కించటం పరశురాంకి వెన్నతో పెట్టిన విద్య’’ అన్నారు ‘బన్ని’ వాసు. ఈ చిత్రానికి కెమెరా: మణికందన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సత్య గమిడి.
Comments
Please login to add a commentAdd a comment