హీరోయిన్‌ను నిజంగానే ఏడిపించారు! | Heroine Rashmika Mandanna Cried on Geetha Govindam Set | Sakshi
Sakshi News home page

హీరోయిన్‌ను నిజంగానే ఏడిపించారు!

Published Wed, Apr 24 2019 10:44 AM | Last Updated on Wed, Apr 24 2019 2:40 PM

Heroine Rashmika Mandanna Cried on Geetha Govindam Set - Sakshi

ఛలో సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన సాండల్‌వుడ్‌ బ్యూటీ రష్మిక మందన్న. తొలి సినిమాతోనే సూపర్‌ హిట్ అందుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్ బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. అంతేకాదు త్వరలో సూపర్‌ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్‌ రావిపూడి తెరకెక్కించనున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుందన్న ప్రచారం జరుగుతోంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రష్మిక గీత గోవిందం సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా ఓ రోజు రష్మిక సెట్‌కు ఆలస్యంగా వెళ్లిందట. ఆ సమయంలో సెట్‌ ఉన్న వాళ్లంతా సీరియస్‌గా ఎవరి పని వారు చేసుకుంటూ రష్మికను పలకరించలేదట. దీంతో తాను పొరపాటు చేశానని భావించిన రష్మిక కన్నీరు పెట్టుకున్నానని తెలిపింది.

తరువాత కాసేపటికి రష్మిక దగ్గరకు వచ్చిన దర్శకుడు పరశురామ్‌, సీన్‌లో ఒరిజినల్‌ ఎమోషన్స్‌ ను క్యాప్చర్‌ చేయటం కోసమే తనను ఏడిపించామని చెప్పటంతో ఊపిరి పీల్చుకున్నానని వెల్లడించింది. అయితే ఏ సీన్‌ కోసం దర్శకుడు తనను ఏడిపించాడో మాత్రం రష్మిక వెల్లడించలేదు. విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన గీత గోవిందం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మరో సారి ఇద్దరు జంటగా డియర్‌ కామ్రేడ్ సినిమాలో నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement