
బిగ్‌బాస్‌లో సెలబ్రెటీలు సడెన్‌గా ఎంట్రీ ఇచ్చి హౌస్‌మేట్స్, ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నారు. ‘వైఫ్ ఆఫ్ రామ్’ ప్రమోషన్స్‌లో భాగంగా మంచు లక్ష్మి హౌస్‌లోకి ఎంట్రీ చేసిన సందడిని చూశాం. లోక నాయకుడు కమల్ హాసన్ బిగ్‌బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి హౌస్‌మేట్స్‌ను ఆశ్చర్యపరిచాడు. ఈ యూనివర్సల్ హీరోతో కలిసి ఇంటి సభ్యులు చేసిన హంగామాను ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేశారు. తాజాగా విజయ్ దేవరకొండ కూడా బిగ్‌బాస్‌లోకి వచ్చాడు.
‘గీత గోవిందం’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోన్న విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరుశురామ్‌తో కలిసి బిగ్‌బాస్ షోలో ఎంట్రీ ఇచ్చాడు. ఎలాంటి వేదిక దొరికినా తన మాటలతో మాయ చేసే అర్జున్ రెడ్డి.. ఇక ఇంటి సభ్యులతో ఎంత హంగామా చేశాడో తెలియాలంటే.. ఆదివారం షో చూడాల్సిందే. విజయ్ ఎంట్రీకి సంబంధించిన ప్రోమోను కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment