నాని విజయ్ దేవరకొండ, చిరంజీవి, రష్మికా మండన్నా
నేటి సాంకేతిక యుగంలో స్మార్ట్ ఫోన్ లేని ఇల్లు ఉండదు అంటే అతిశయోక్తి కాదు. ఒకే ఇంట్లో నాలుగైదు స్మార్ట్ ఫోన్స్ కూడా ఉన్నాయి. రోజులో కొంత సయమాన్ని ఇంటర్నెట్ బ్రౌజింగ్, సోషల్ మీడియాకి యువత టైమ్ కేటాయిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. మరి.. ఈ ఏడాది గూగుల్‌లో నెటిజన్లు వెతికిన సౌత్ ఇండియా టాప్ ట్రెండింగ్ స్టార్‌గా చిరంజీవి నిలిచారని ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక పేర్కొంది. ఇంకా ఈ ‘టాప్ ట్రెండింగ్ సౌత్ ఇండియన్ మూవీ స్టార్స్ 2018’ విభాగంలో నాని ద్వితీయ స్థానం సంపాదించారు.
ఇంకా మూడు, నాలుగు, ఆరు, ఎనిమిది, తొమ్మిది, పది స్థానాల్లో వరుసగా బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, ప్రకాశ్‌రాజ్, మోహన్‌బాబు, జగపతిబాబు, నాగశౌర్య నిలిచారని సదరు పత్రిక పేర్కొంది. ఇక ఈ జాబితాలో కథానాయికల్లో ఐదో స్థానంలో రష్మికా మండన్నా, యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ఆరో స్థానం కైవశం చేసుకోవడం విశేషం. ఈ సంగతి అలా ఉంచి... టాప్ ట్రెండింగ్ సౌత్ ఇండియన్ మూవీస్ విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ, రష్మికా మండన్నా జంటగా పరశురామ్ దర్శకత్వం వహించిన ‘గీత గోవిందం’ సినిమా టాప్‌లో నిలిచిందట.
తమిళ హీరో విజయ్–దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘సర్కార్’ చిత్రం సెకండ్ ప్లేస్‌ను దక్కించుకుంది. రామ్‌చరణ్ ‘రంగస్థలం’, మహేశ్‌బాబు ‘భరత్ అనే నేను’, రజనీకాంత్ చిత్రాలు ‘కాలా, 2.ఓ’, కీర్తీసురేశ్ నటించిన ‘మహానటి’, వరుసగా 3,4,5,6,7 స్థానాల్లో నిలిచిన చిత్రాలు. అలాగే టాప్ ట్రెండింగ్ సౌత్ ఇండియన్ సాంగ్స్ కేటగిరీని పరిశీలిస్తే... నాగార్జున, నాని మల్టీస్టారర్ మూవీ ‘దేవదాసు’ చిత్రంలోని ‘వారు వీరు..’ అనే సాంగ్ టాప్ ప్లేస్‌లో నిలవడం విశేషం. ‘టాక్సీవాలా’లోని ‘మాటే వినదుగా...’, హలో గురు ప్రేమకోసమే..’ సినిమాలో ‘మై వరల్డ్ ఈజ్ ఫ్లైయింగ్’, ‘గీత గోవిందం’లోని ‘ఇంకేం ఇంకేం కావాలే..’
సాంగ్స్ వరసగా 2,3,4 స్థానాల్లో నిలిచాయట.
అలాగే ఈ ఏడాది ఐఎమ్‌డిబి (ఇంటర్‌నెట్ మూవీ డేటాబేస్) విడుదల చేసిన టాప్ టెన్ బెస్ట్ ఇండియన్ మూవీస్ జాబితాలో ‘మహానటి’, ‘రంగస్థలం’ చిత్రాలు వరుసగా 4,7 స్థానాల్లో నిలిచాయి. ఇక బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘అంధాధూన్’ ఈ లిస్ట్‌లో అగ్రస్థానంలో నిలిచింది. తమిళ హీరో విష్ణువిశాల్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘రాక్షసన్’ రెండో స్థానంలో నిలవగా విజయ్ సేతుపతి, త్రిష నటించిన ‘96’ చిత్రం మూడో ప్లేస్‌లో నిలిచింది. ‘బధాయి హో (5), ప్యాడ్ మ్యాన్ (6), స్త్ర్రీ (8), రాజీ (9), సంజు (10) ఈ లిస్ట్‌లో చోటు సంపాదించిన మిగతా హిందీ చిత్రాలు. బాలీవుడ్‌లో అంతమంది స్టార్లు ఉన్నప్పటికీ యువనటుడు ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘అంధాధూన్, బధాయి హో’ చిత్రాలు టాప్ టెన్‌లో ఉండటం చెప్పుకోవాల్సిన విషయం.
ప్రభాస్ 13
సెక్సీయస్ట్ ఆసియన్‌మెన్ 2018 జాబితా కూడా విడుదలైంది. సౌత్ కొరియాకు చెందిన బీటీఎస్ అనే మ్యూజిక్ బ్యాండ్ బృందం టాప్‌ప్లేస్‌ను దక్కించుకుంది. ఈ బృందంలో ఏడుగురు సభ్యులు ఉన్నారు.
మూడో స్థానంలో ఉన్న షాహిద్ కపూర్ సెక్సీయస్ట్ బాలీవుడ్ యాక్టర్‌గా నిలిచారు. ఇక రణ్‌వీర్ సింగ్, ప్రభాస్, సల్మాన్‌ఖాన్, వరుణ్ ధావన్, షారుక్ ఖాన్, రణ్‌బీర్ కపూర్ వరుసగా 11,13,14,18,25,29 స్థానాల్లో నిలిచారు.
కన్నుకొట్టి అందరి కళ్లను తనవైపు తిప్పుకున్న మలయాళ హీరోయిన్ ప్రియా ప్రకాశ్ వారియర్ ఇండియా గూగుల్ సెర్చ్‌లో మోస్ట్ సెర్డ్చ్ పర్సనాలిటీ–2018గా తొలి స్థానం సంపాదించుకున్నారు. డ్యాన్సింగ్ పర్సనాలిటీ స్పనా చౌదరి రెండో స్థానంలో నిలిచారు. ఇక బాలీవుడ్ నటి సోనమ్‌కపూర్ భర్త ఆనంద్ ఆహూజా ఈ జాబితాలో ఐదోస్థానంలో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment