
అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ సృష్టించిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ.. గీత గోవిందంతో మరోసారి సత్తా చాటాడు. ఈ సినిమా వందకోట్లకు పైగా వసూళ్లు సాధించటంతో దర్శక నిర్మాత విజయ్ తో సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న నోటా తో పాటు టాక్సీవాలా సినిమాల్లో నటిస్తున్న విజయ్ త్వరలో బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడట.
బాలీవుడ్ దర్శక ద్వయం రాజ్, కృష్ణ డికెలు విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బాలీవుడ్‌లో షోర్ ఇన్ ద సిటీ, గో గోవా గోన్ సినిమాలతో ఆకట్టుకున్న ఈ దర్శకద్వయం తాజా స్త్రీ సినిమాతో మరో విజయాన్ని అందుకున్నారు. తెలుగులో ఢీ ఫర్ దోపిడి సినిమాకు దర్శకత్వం వహించారు.
Comments
Please login to add a commentAdd a comment