
విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం గీత గోవిందం. ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసిన చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు. ఫస్ట్ లుక్, టీజర్‌లతో పాటు ఇంకే ఇంకే ఇంకే కావాలి పాటకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. విజయ్ దేవరకొండ స్వయంగా పాడిన వాట్ ద ఎఫ్ పాటను ఈ రోజు(గురువారం) రిలీజ్ చేశారు. ఈ పాట కూడా యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.
ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేసిన గీత గోవిందం సినిమాపై మరింతగా అంచనాలు పెంచేస్తున్నారు చిత్రయూనిట్. గీత ఆర్ట్స్ 2 బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా ఆడియో వేడుకకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. జూలై 29 సాయంత్రం హైదరాబాద్ జేఆర్‌సీ కన్వెన్షన్‌లో ఈ వేడుకను అభిమానుల సమక్షంలో నిర్వహించనున్నారు. పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఛలోఫేం రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment