
విజయ్ దేవరకొండ
గ్యాప్ లేకుండా వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు విజయ్ దేవరకొండ. ‘గీత గోవిందం’ రిలీజ్‌కు రెడీగా ఉన్న వెంటనే ‘డియర్ కామ్రేడ్’ సినిమాను స్టార్ట్ చేసేశారు. నూతన దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మికా మండన్నా జంటగా రూపొందుతున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ‘ఫైట్ ఫర్ వాట్ యు లవ్’ అనేది ఉపశీర్షిక. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ గోదావరి జిల్లా తోండంగిలో సోమవారం స్టార్ట్ అయింది. ‘‘ఇందులో విజయ్ ఆంధ్రా అబ్బాయిగా కనిపిస్తాడు. ఆంధ్రా యాసలో విజయ్ పలికే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. సోషల్ రెస్పాన్సిబులిటీస్ ఉన్న పాత్రను పోషిస్తున్నాడు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: జస్టిన్ ప్రభాకరన్, కెమెరా: సుజిత్ సారంగ్.
Comments
Please login to add a commentAdd a comment