
విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ తరువాత చాలా గ్యాప్‌తో వచ్చిన సినిమా గీత గోవిందం. విజయ్‌ను ఇప్పటివరకు అర్జున్‌రెడ్డి గానే చూసిన ప్రేక్షకులు.. గీతగోవిందం సినిమాలోని విజయ్ నటనకూ ఆకర్షితులయ్యారు. సూపర్ హిట్ టాక్‌తో ఈ చిత్రం దూసుకెళ్తూ మంచి వసూళ్లను సాధిస్తోంది.
ఇప్పటికే రాజమౌళి, చిరంజీవి లాంటి ప్రముఖులు సినిమా యూనిట్‌ను మెచ్చుకున్నారు. తాజాగా సూపర్‌స్టార్ మహేష్ బాబు ఈ మూవీపై స్పందిస్తూ.. ‘ గీత గోవిందం గెలిచింది. సినిమా చూస్తూ ఎంజాయ్ చేశాను. విజయ్ దేవరకొండ, రష్మిక చాలా బాగా నటించారు. సుబ్బరాజు, వెన్నెల కిషోర్‌లకు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చిత్ర బృందానికి కంగ్రాట్స్’ అంటూ ట్వీట్ చేశారు. దీన్ని వెన్నెల కిషోర్ రీట్వీట్ చేస్తూ.. మహేష్‌కు ధన్యవాదాలు తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment