‘గీత గోవిందం’ బాలీవుడ్‌ రీమేక్‌లో హీరో ఎవరంటే..? | Ishaan Khatter May Act In Geetha Govindam Hindi Remake | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 17 2019 5:20 PM | Last Updated on Thu, Jan 17 2019 5:20 PM

Ishaan Khatter May Act In Geetha Govindam Hindi Remake - Sakshi

గతేడాది విజయ్‌ దేవరకొండ నటించిన సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం గీత గోవిందం. ఎలాంటి అంచనాలు లేకుండా వందకోట్లు కొల్లగొట్టి ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచింది. ఈ మూవీతో విజయ్‌ దేవరకొండ ఇమేజ్‌ అమాంతం పెరిగేసింది. ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్‌ చేయనున్నట్లు సమాచారం. 

ఇప్పటికే విజయ్‌ నటించిన పెళ్లి చూపులు (మిత్రోన్‌), అర్జున్‌ రెడ్డి(కబీర్‌ సింగ్‌) చిత్రాలు బాలీవుడ్‌కు వెళ్లగా.. గీత గోవిందం కూడా అక్కడ పట్టాలెక్కబోతోన్నట్లు సమాచారం. ఈ సినిమాలో ధడక్‌ సినిమాతో తన టాలెంట్‌ను నిరూపించుకున్న ఇషాన్‌ ఖట్టర్‌.. ఈ రీమేక్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ మూవీ బాలీవుడ్‌లో ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement