‘‘అర్జున్‌రెడ్డి’ సినిమాలోని పాత్రను బట్టి విజయ్ దేవరకొండ అలా అగ్రెసివ్‌గా నటించాడు. ‘గీత గోవిందం’ సినిమాలో డౌన్ టు ఎర్త్. ఫ్యామిలీ ఓరియంటెడ్, విలువలున్న ఓ మంచి వ్యక్తిగా పాత్రకు అనుగుణంగా నటించాడు’’ అని డైరెక్టర్ పరశురామ్ అన్నారు. విజయ్ దేవరకొండ, రష్మికా మండన్నా జంటగా తెరకెక్కిన చిత్రం ‘గీత గోవిందం’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్ని’ వాసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు పరశురామ్ పంచుకున్న విశేషాలు...
రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. ఈ సినిమాలో గోవిందానికి ఓ ఐడియాలజీ ఉంటుంది. గీతకు ఇంకో ఐడియాలజీ ఉంటుంది. ఆ ఐడియాలజీల మధ్య వచ్చే సంఘర్షణే మా సినిమా. విజయ్ జూనియర్ సైంటిస్ట్ పోస్ట్‌కు దరఖాస్తు చేసి ఉంటాడు. ఆ గ్యాప్‌లో ఓ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా వర్క్ చేస్తుంటాడు. గీత ఐటీ ఉద్యోగినిగా కనిపిస్తుంది. ఈ సినిమాలో గీత పాత్రకి నటించడానికి చాలా స్కోప్ ఉంటుంది. పది.. పదిహేను మంది హీరోయిన్లకు ఈ కథ చెప్పాను. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ కథ చెప్పని హీరోయిన్ లేదు. వారు రిజెక్ట్ చేసేంతగా ఏం లేదు. విజయ్ కొత్తవాడు.. పరశురాం అప్ కమింగ్ డైరెక్టర్.. ఇలా చాలా ఉంటాయి. ఏ పెద్ద హీరోయిన్‌కైనా స్టార్ హీరోతోనో, పెద్ద డైరెక్టర్‌తోనో చేయాలని ఉంటుంది కదా? హీరోయిన్ లావణ్యా త్రిపాఠితో కొద్ది రోజులు షూట్ చేశామనే మాట అవాస్తవం.
విజయ్ డేట్స్‌కీ, లావణ్య డేట్స్‌కి కుదరలేదు. అందుకే ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ‘గీత గోవిందం’ చిత్రంలో విలన్లంటూ ఎవరూ లేరు. గీతకు గోవింద్ విలన్.. గోవిందానికి గీత విలన్. పాటల్ని హిట్ చేసేద్దామనుకుంటే హిట్ అవ్వవు. ప్రతి సాంగ్‌కు ఓ సందర్భం ఉండాలి. మా సినిమాలో సాంగ్స్ అన్నీ అలానే ఉంటాయి. ప్రతి సాంగ్‌లో కథ నడుస్తు్తంది. మ్యూజిక్ డైరెక్టర్ గోపి కూడా బాగా సహకరించాడు. విజయ్‌తో పాట పాడించాలనే ఐడియా నాదే. తను చాలా బాగా పాడాడు. కానీ, అది అనవసరంగా వివాదం అయింది. ఏ సినిమాకైనా నా బలం ఎమోషన్, కామెడీ. ఈ రెండూ మిస్ కాకుండా చూసుకుంటాను. నాలోని రచయితను, డైరెక్టర్‌ను విడదీసి చూడలేను. రచయితతో పాటు దర్శకుడిగా కూడా కష్టపడుతున్నాను. మైత్రీ మూవీస్‌లో ఓ సినిమా చెయ్యాలి. గీతా ఆర్ట్స్‌లో ఇంకో సినిమా ఉంటుంది. స్క్రిప్ట్ ఇంకా ఫైనల్ అవ్వలేదు. రెండు మూడు లైన్లు ఉన్నాయి.. కథ సిద్ధం చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment