Parusuram
-
ఈ సినిమాను మహేశ్ ఒప్పుకోవడానికి ప్రధాన కారణం అదే: డైరెక్టర్ పరశురామ్
Director Parasuram About Mahesh babu Role: దర్శకుడు పరశురామ్ తాజాగా రూపొందించిన చిత్రం ‘సర్కారు వారి పాట’ మరికొద్ది రోజుల్లో థియేటర్లో సందడి చేయబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ జోరు పెంచేసింది. ఈ క్రమంలో నిన్న(మే 2న) ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ 24 గంటల్లోనే మిలియన్ల వ్యూస్ రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే మూవీ ప్రమోషన్లో భాగంగా డైరెక్టర్ పరశురామ్ ఓ మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా మూవీ విశేషాలతో పాటు పలు ఆసక్తిర విషయాలను పంచుకున్నాడు. ‘ఈ సినిమాలో ఆయన క్యారెక్టరైజేషన్ చాలా భిన్నంగా ఉంటుంది. ఇంతకుముందు ఆయన చేసిన ఏ సినిమాలోని పాత్రను.. ఈ సినిమాలో పాత్రతో పోల్చలేము. అందుకే ఆయన కథ విన్న వెంటనే ఓకే చేశారు’ అని అన్నాడు. చదవండి: ఆ సాంగ్ చేస్తున్నప్పుడు మహేశ్‌కు సారీ చెప్పా: కీర్తి సురేష్ అలాగే ‘ఈ సినిమాలో ఆయన రోల్ యాటిట్యూడ్ చాలా కొత్తగా కనిపిస్తుంది. ఈ సినిమా కథాకథనాలు, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ మహేశ్ బాబుకి ఎంతో నచ్చాయి. అన్నింటికీ మించి హీరో పాత్ర, యాటిట్యూడ్ ఆయనను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాను ఆయన ఒప్పుకోవడానికి ప్రధానమైన కారణం కూడా అదే. ఇక సినిమాలో మహేశ్ డాన్స్, ఫైట్స్, నెక్ట్ లెవెల్లో ఉంటాయి’ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. కాగా మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మే 12న విడుదల కాబోతోన్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. కీర్తి సురేశ్ హీరోయిన్గా నటించింది. -
అది అవాస్తవం
‘‘అర్జున్‌రెడ్డి’ సినిమాలోని పాత్రను బట్టి విజయ్ దేవరకొండ అలా అగ్రెసివ్‌గా నటించాడు. ‘గీత గోవిందం’ సినిమాలో డౌన్ టు ఎర్త్. ఫ్యామిలీ ఓరియంటెడ్, విలువలున్న ఓ మంచి వ్యక్తిగా పాత్రకు అనుగుణంగా నటించాడు’’ అని డైరెక్టర్ పరశురామ్ అన్నారు. విజయ్ దేవరకొండ, రష్మికా మండన్నా జంటగా తెరకెక్కిన చిత్రం ‘గీత గోవిందం’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్ని’ వాసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు పరశురామ్ పంచుకున్న విశేషాలు... రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. ఈ సినిమాలో గోవిందానికి ఓ ఐడియాలజీ ఉంటుంది. గీతకు ఇంకో ఐడియాలజీ ఉంటుంది. ఆ ఐడియాలజీల మధ్య వచ్చే సంఘర్షణే మా సినిమా. విజయ్ జూనియర్ సైంటిస్ట్ పోస్ట్‌కు దరఖాస్తు చేసి ఉంటాడు. ఆ గ్యాప్‌లో ఓ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా వర్క్ చేస్తుంటాడు. గీత ఐటీ ఉద్యోగినిగా కనిపిస్తుంది. ఈ సినిమాలో గీత పాత్రకి నటించడానికి చాలా స్కోప్ ఉంటుంది. పది.. పదిహేను మంది హీరోయిన్లకు ఈ కథ చెప్పాను. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ కథ చెప్పని హీరోయిన్ లేదు. వారు రిజెక్ట్ చేసేంతగా ఏం లేదు. విజయ్ కొత్తవాడు.. పరశురాం అప్ కమింగ్ డైరెక్టర్.. ఇలా చాలా ఉంటాయి. ఏ పెద్ద హీరోయిన్‌కైనా స్టార్ హీరోతోనో, పెద్ద డైరెక్టర్‌తోనో చేయాలని ఉంటుంది కదా? హీరోయిన్ లావణ్యా త్రిపాఠితో కొద్ది రోజులు షూట్ చేశామనే మాట అవాస్తవం. విజయ్ డేట్స్‌కీ, లావణ్య డేట్స్‌కి కుదరలేదు. అందుకే ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ‘గీత గోవిందం’ చిత్రంలో విలన్లంటూ ఎవరూ లేరు. గీతకు గోవింద్ విలన్.. గోవిందానికి గీత విలన్. పాటల్ని హిట్ చేసేద్దామనుకుంటే హిట్ అవ్వవు. ప్రతి సాంగ్‌కు ఓ సందర్భం ఉండాలి. మా సినిమాలో సాంగ్స్ అన్నీ అలానే ఉంటాయి. ప్రతి సాంగ్‌లో కథ నడుస్తు్తంది. మ్యూజిక్ డైరెక్టర్ గోపి కూడా బాగా సహకరించాడు. విజయ్‌తో పాట పాడించాలనే ఐడియా నాదే. తను చాలా బాగా పాడాడు. కానీ, అది అనవసరంగా వివాదం అయింది. ఏ సినిమాకైనా నా బలం ఎమోషన్, కామెడీ. ఈ రెండూ మిస్ కాకుండా చూసుకుంటాను. నాలోని రచయితను, డైరెక్టర్‌ను విడదీసి చూడలేను. రచయితతో పాటు దర్శకుడిగా కూడా కష్టపడుతున్నాను. మైత్రీ మూవీస్‌లో ఓ సినిమా చెయ్యాలి. గీతా ఆర్ట్స్‌లో ఇంకో సినిమా ఉంటుంది. స్క్రిప్ట్ ఇంకా ఫైనల్ అవ్వలేదు. రెండు మూడు లైన్లు ఉన్నాయి.. కథ సిద్ధం చేయాలి. -
ఐ యామ్ స్టిల్ వర్జిన్: విజయ్ దేవరకొండ
సెన్సేషన్ స్టార్ విజయ్‌దేవరకొండ చేతి నిండా ప్రాజెక్టులతో తెగ బిజీగా ఉన్నాడు. కన్నడ క్యూటీ రష్మిక మందనతో కలిసి కాస్త వెరైటీగా గీత గోవిందం చిత్ర ప్రమోషన్లో మనోడు పాల్గొంటున్నాడు. వారిద్దరి సరదా సంభాషణలతో ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ కాస్త తేడా పోస్టర్‌నే వదిలారు. ‘మీరు ఏమైనా అనుకోండి. నా అఫీసియల్ స్టేటస్ మాత్రం ఇదే మేడమ్’ అంటూ పోస్టర్‌ను ఉంచాడు. పోస్టర్ బ్యాక్ గ్రౌండ్లో ‘ఐ యామ్ 25.. స్టిల్ వర్జిన్ మేడమ్.. అంటూ గోవిందం(విజయ్).. గీత(రష్మిక)ను ఓరగా చూస్తున్నాడు. పరుశురామ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న గీత గోవిందం ఆగష్టు 15న విడుదల కానుంది. వీటితోపాటే విజయ్ నటించిన టాక్సీవాలా, నోటా చిత్రాలు శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుని రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. Meeru em aina anukondi, My official status matram idhe madam.#GeethaGovindam This Independence Day. pic.twitter.com/02ofgVXHC8 — Vijay Deverakonda (@TheDeverakonda) July 3, 2018 -
ప్రియుడు అనుకొని.. కొడుకుని నరికాడు
సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానించిన భర్త.. ప్రియుడు అనుకుని కన్నకొడుకుపైనే గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటన కర్నూల్ జిల్లా బేతంచెర్ల మండలంలోని గుత్‌పల్లెలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన సోమన్న రామలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్యకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని సోమన్న అనుమానిస్తుండేవాడు. దీంతో దంపతులకు తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున పీకల దాకా మద్యం సేవించిన సోమన్న ఇంటికి వచ్చాడు. ఈ సమయంలో తన భార్య ప్రియుడు ఇంట్లో ఉన్నాడని భావించి బెడ్‌పై పడుకుని ఉన్న పెద్ద కొడుకు పరుశురామ్(14)పై గొడ్డలితో దాడి చేశాడు. దీంతో పరుశురామ్‌కు తీవ్ర గాయాలవడంతో బేతంచెర్లకు తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో బాలుడుని కర్నూలుకు తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు సోమన్నపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
సింగిల్ సిట్టింగ్‌లో ఓకే!
2016లో వరుసగా ‘సరైనోడు, శ్రీరస్తు శుభమస్తు, ధృవ’ లాంటి హ్యట్రిక్ సూపర్‌హిట్స్‌తో దూసుకుపోతున్న గీతా ఆర్ట్స్‌కి అనుభంద సంస్థ జీఏ 2 బ్యానర్లో ‘భలే భలే మగాడివోయ్’ లాంటి చిత్రం తరువాత నిర్మాత బన్ని వాసు మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గీతా ఆర్ట్స్‌లో కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా విజయాన్ని సాధించిన ‘శ్రీరస్తు శుభమస్తు’ దర్శకుడు పరుశురాం (బుజ్జి) దర్శకత్వంలో ఆయన ఓ చిత్రం నిర్మించనున్నారు. గతేడాది చిన్న చిత్రంగా విడుదలై ట్రెండింగ్ సక్సెస్ సొంతం చేసుకున్న ‘పెళ్ళి చూపులు’తో అందరి అభిమానాన్ని గెలుచుకున్న విజయ్ దేవరకొండ ఇందులో హీరో. నాగచైతన్యతో ‘100% లవ్’, సాయిధరమ్‌తేజ్‌తో ‘పిల్లా నువ్వులేని జీవితం’, నానితో ‘భలే భలే మగాడివోయ్’ వంటి విజయాల తర్వాత ఇప్పడు విజయ దేవరకొండతో బన్ని వాసు ఈ చిత్రం నిర్మించనున్నారు. 2016లో సౌత్‌లో నాలుగు విజయాలు సొంతం చేసుకున్న గీతా ఆర్ట్స్ గీతా ఆర్ట్స్‌కి విజయాలు కొత్త కాదు. ఎప్పటికప్పుడు ట్రెండ్‌కి తగ్గట్టు అప్డేట్ అవుతూ నిర్మాత అల్లు అరవింద్ తన చిత్రాలు అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందే విధంగా చూసుకుంటారు. అంతే కాదు ఎంతోమంది నిర్మాతలకి ఆదర్శంగా నిలుస్తున్నారు. 2016లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అత్యంత భారీగా ఆయన నిర్మించిన మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ ‘సరైనోడు’. ఈ చిత్రం సమ్మర్లో విడుదలై, భారీ కలెక్షన్లతో బన్ని కెరీర్లోనే బెస్ట్ రెవిన్యూ ఫిల్మ్‌గా నిలిచింది. అలాగే అల్లు శిరీష్ హీరోగా ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రాన్ని పక్కా ఫ్యామిలి ఎంటర్టైనర్గా తెరకెక్కించారు. ఇది కూడా అల్లు శిరీష్ కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ గా నిలిచింది. 2016 చివరిలో విడుదలైన స్టైలిష్ ఎంటర్టైనర్గా అందిరి హృదయాలు దోచుకుని మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ 2016 బెస్ట్ రెవిన్యూ ఫిల్మ్‌గా ‘ధృవ’తో తెలుగులో హ్యాట్రిక్ హిట్ సాధించారు. అలాగే తెలుగులో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన ‘భలే భలే మగాడివోయ్’ చిత్రాన్ని కన్నడ భాషలో నిర్మించారు. డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం సూపర్ సక్సెస్ సాధించింది. ఇప్పడు పరుశురాం దర్శకత్వంలో విజయ్‌దేవరకొండ హీరోగా బన్ని వాసు నిర్మాతగా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రేక్షకుడి ఆనందమే ముఖ్యం చిత్ర సమర్పకులు అల్లు అరవింద్ మాట్లాడుతూ – ‘‘ప్రతి ప్రేక్షకుడు ఆనందం పొందాలనే సంకల్పంతోనే చిత్రాలు రూపొందిస్తున్నాం. 2016లో మాస్ ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్, స్టైలిష్ ఎంటర్టైనర్... ఇలా మూడు వైవిధ్యమైన జానర్లో చిత్రాలు చేశాం. అవి సూపర్ డూపర్ హిట్ చిత్రాలుగా ఆదరణ పొందాయి. ఇక నుండి వచ్చేవి కూడా ఇలానే మంచి చిత్రాలుగా ఆదరణ పొందే విధంగా చేస్తాం. పరుశురాం చెప్పిన కథ చాలా బాగుంది. త్వరలో వివరాలు తెలియజేస్తాం’’ అన్నారు. సింగిల్ సిట్టింగ్‌లో ఓకే నిర్మాత బన్ని వాసు మాట్లాడుతూ – ‘‘అల్లు అరవింద్‌గారు నిర్మాతగా 2016లో నిర్మించిన మూడు చిత్రాలు సూపర్‌హిట్స్ కావడం హ్యపీగా వుంది. పరుశురాంగారు చెప్పిన కథ అరవింద్‌గారికి చాలా నచ్చింది. వెంటనే నాకు వినిపించారు. సింగిల్ సిట్టింగ్‌లోనే నాకు నచ్చింది. పరుశురాంగారి విజన్ సూపర్‌గా వుంటుంది. చాలా చిత్రాలు ప్రూవ్ అయ్యాయి కూడా. ‘భలే భలే మగాడివోయ్’లాంటి సూపర్ డూపర్ హిట్ తరువాత జీఏ2 బ్యానర్లో గ్యాప్ తీసుకున్నాం. చేస్తే ఆ రేంజి విజయాన్ని సాధించే చిత్రాలు చేయాలనే సంకల్పంతో గ్యాప్ తీసుకున్నాం. ఇప్పడీ కథ ఆ రేంజిలో వుందనే నమ్మకంతో ఓకే చేశాం. అల్లు అరవింద్ గారు సమర్పణలో ఈ చిత్రం అతి త్వరలో సూపర్ టెక్నిషియన్స్‌తో భారీ తారాగణంతో సెట్స్ మీదకి వెళ్ళనుంది’’ అన్నారు. డబుల్ లక్! దర్శకుడు పరుశురాం మాట్లాడుతూ – ‘‘గీతా ఆర్ట్స్‌లో ఒక్క చిత్రం చేయటం లక్ అంటారు. నేను వరుసగా రెండవ చిత్రం కూడా చేసే డబుల్ లక్‌ని అరవింద్‌గారు ఇచ్చినందుకు చాలా ఆనందంగా వుంది’’ అన్నారు.