Sarkaru Vaari Paata: Director Parasuram About Mahesh babu Role Details Inside - Sakshi
Sakshi News home page

Mahesh Babu-Director Parasuram: ఈ సినిమాను మహేశ్‌ ఒప్పుకోవడానికి ప్రధాన కారణం అదే

Published Tue, May 3 2022 3:03 PM | Last Updated on Tue, May 3 2022 5:46 PM

Director Parasuram About Mahesh babu Role In Sarkaru Vaari Paata - Sakshi

Director Parasuram About Mahesh babu Role: దర్శకుడు పరశురామ్‌ తాజాగా రూపొందించిన చిత్రం ‘సర్కారు వారి పాట’ మరికొద్ది రోజుల్లో థియేటర్లో సందడి చేయబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌ జోరు పెంచేసింది. ఈ క్రమంలో నిన్న(మే 2న) ట్రైలర్‌ విడుదల చేశారు మేకర్స్‌. ఈ ట్రైలర్‌ 24 గంటల్లోనే మిలియన్ల వ్యూస్‌ రాబట్టి రికార్డు క్రియేట్‌ చేసింది. ఇదిలా ఉంటే మూవీ ప్రమోషన్లో భాగంగా డైరెక్టర్‌ పరశురామ్‌ ఓ మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా మూవీ విశేషాలతో పాటు పలు ఆసక్తిర విషయాలను పంచుకున్నాడు. ‘ఈ సినిమాలో ఆయన క్యారెక్టరైజేషన్ చాలా భిన్నంగా ఉంటుంది. ఇంతకుముందు ఆయన చేసిన ఏ సినిమాలోని పాత్రను.. ఈ సినిమాలో పాత్రతో పోల్చలేము. అందుకే ఆయన కథ విన్న వెంటనే ఓకే చేశారు’ అని అన్నాడు. 

చదవండి: ఆ సాంగ్‌ చేస్తున్నప్పుడు మహేశ్‌కు సారీ చెప్పా: కీర్తి సురేష్‌

అలాగే ‘ఈ సినిమాలో ఆయన రోల్‌ యాటిట్యూడ్ చాలా కొత్తగా కనిపిస్తుంది. ఈ సినిమా కథాకథనాలు, ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇవన్నీ మహేశ్ బాబుకి ఎంతో నచ్చాయి. అన్నింటికీ మించి హీరో పాత్ర, యాటిట్యూడ్ ఆయనను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాను ఆయన ఒప్పుకోవడానికి ప్రధానమైన కారణం కూడా అదే. ఇక సినిమాలో మహేశ్ డాన్స్‌, ఫైట్స్‌, నెక్ట్‌ లెవెల్లో ఉంటాయి’ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. కాగా మహేశ్‌ బాబు హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మే 12న విడుదల కాబోతోన్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్‌ సంగీతం అందిస్తున్నారు. కీర్తి సురేశ్‌ హీరోయిన్‌గా నటించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement