Watch: Sarkaru Vaari Paata Movie Ma Ma Mahesha Full Video Song Released - Sakshi
Sakshi News home page

Sarkaru Vaari Paata Songs: ‘మ..మ.. మహేశా..’ ఫుల్‌ వీడియో సాంగ్‌ వచ్చేసింది

Published Fri, Jun 17 2022 2:17 PM | Last Updated on Fri, Jun 17 2022 3:32 PM

Ma Ma Mahesha Full Video Song Release From Sarkaru Vaari Paata Movie - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్‌ జంటగా నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. మే 12న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించింది. దాదాపు రూ. 200 కోట్లకుపైగా వసూళు చేసిన ఈ మూవీకి పరశురామ్​ దర్శకత్వం వహించారు.  ఈ చిత్ర విజ‌యంలో పాట‌లు కూడా కీల‌క‌పాత్ర పోషించాయనడంలో అతిశయోక్తి లేదు. త‌మ‌న్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలన్ని సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘మ‌.. మ‌.. మ‌హేశా’ అనే మాస్ బీట్‌ సాంగ్‌ విపరీతంగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ పాటకు సంబంధించిన ఫుల్‌ వీడియో సాంగ్‌ను మేకర్స్ యూట్యూబ్‌లో విడుద‌ల చేశారు.

చదవండి: ఇంటింటికి సబ్బులు అమ్ముకుంటున్న స్టార్ నటి ఐశ్వర్య

శ్రీకృష్ణ‌, జోనితా గాంధీ ఆల‌పించిన ఈ పాట‌కు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించాడు. ఈ పాట‌లో మ‌హేశ్‌, కీర్తి సురేశ్‌ డ్యాన్స్‌కు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. ఇటీవ‌లే విడుద‌లైన మురారి వా, పెన్నీ వీడియో సాంగ్స్ మిలియ‌న్ల వ్యూస్‌ను సొంతం చేసుకున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ డిజిటల్‌ రైట్స్‌ను అమెజాన్‌ ప్రైం భారీ రేటుకు దక్కించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌లో రెంటల్‌ పద్ధతిలో అందుబాటులో ఉన్న ఈ సినిమా జూన్‌ 23 నుంచి ఉచితంగా అందుబాటులోకి తీసుకురానుంది ఆమెజాన్‌. 

చదవండి: విషాదం.. అప్పుడే పుట్టిన బిడ్డను కోల్పోయిన సింగర్‌ దంపతులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement