
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. ‘గీత గోవిందం’ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మే 12న విడుదలై ఘన విజయం సాధించింది. 'సర్కారు వారి పాట' రిలీజైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది.
Anand Mahindra Interesting Tweet On Mahesh Babu Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. ‘గీత గోవిందం’ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మే 12న విడుదలై ఘన విజయం సాధించింది. 'సర్కారు వారి పాట' రిలీజైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 160.2 కోట్ల గ్రాస్, రూ. 100.44 కోట్ల షేర్‌ను సాధించి రికార్డు సృష్టించింది. ఐదు రోజుల్లో రూ. 100 కోట్ల షేర్ సాధించిన తొలి ప్రాంతీయ చిత్రంగా రికార్డుకెక్కింది. తాజాగా ఈ చిత్రంపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఆసక్తికరంగా ట్వీట్ చేశారు.
అనుపమ్ తరేజా పోస్ట్ చేసిన ఓ వీడియోకు స్పందనగా రీట్వీట్ చేశారు. 'అన్‌బీటబుల్ కాంబినేషన్ అయిన సూపర్ స్టార్ మహేశ్ బాబు, జావా మెరూన్‌లను చూడకుండా ఎలా ఉండగలను. ప్రస్తుతం నేను న్యూయార్క్‌లో ఉన్నాను. న్యూ జెర్సీకి వెళ్లి సినిమా ఎక్కడ ప్రదర్శించబడితే అక్కడికి వెళ్లి చూస్తాను.' అంటూ ఆనంద్ మహీంద్రా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
చదవండి: 👇
అమ్ముడైన టికెట్లు 20 మాత్రమే.. రూ. 85 కోట్లకుపైగా నష్టం
కమల్ హాసన్: ఆయనతో కలిసి నటించాలని ప్రాధేయపడ్డా.. కానీ..
How can I miss watching the unbeatable combination of @urstrulyMahesh and Jawa? I’m in New York & will go out to New Jersey where it’s being screened… #SarkaruVaariPaata, #JawaMaroon https://t.co/ytc5pPQbl1
— anand mahindra (@anandmahindra) May 29, 2022