parushuram
-
విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' టీజర్ ఎప్పుడంటే..?
స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న 'ఫ్యామిలీ స్టార్' సినిమా టీజర్ రిలీజ్ డేట్ అండ్ టైమ్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సినిమా టీజర్ ను రేపు మార్చి 4న సోమవారం సాయంత్రం 6:30 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు. "ఫ్యామిలీ స్టార్" టీజర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ సందర్భంగా ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. "ఫ్యామిలీ స్టార్" సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. హోల్ సమ్ ఎంటర్ టైనింగ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. 'ఫ్యామిలీ స్టార్' చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు. మరో నెల రోజుల టైమ్ మాత్రమే ఉండటంతో ప్రమోషన్ యాక్టివిటీస్ స్పీడప్ చేసింది మూవీ టీమ్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్, పోస్టర్స్, నందనందనా లిరికల్ సాంగ్ ను ఆడియెన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇవన్నీ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన "ఫ్యామిలీ స్టార్" సినిమా సూపర్ హిట్ కానుందనే ఇండికేషన్స్ ఇస్తున్నాయి. -
స్మార్ట్‌ఫోన్ కోసం తాను చనిపోలేదు..! బ్రతికే ఉన్నాడు..!!
మహబూబ్‌నగర్: తల్లిదండ్రులు స్మార్ట్‌ఫోన్ ఇప్పించడం లేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని ఖమ్మంపాడులో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన గోవిందమ్మ, మునెప్ప దంపతులకు ఇద్దరు కుమారులు. వారిలో చిన్నవాడైన పరశురాముడు(20) చదువుకోలేదు. దీంతో రైతు కూలీగా పని చేసేవాడు. తన తోటి స్నేహితులతో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయని, తనకు ఇప్పించాలని తల్లిదండ్రులను కోరాడు. ఇప్పుడు అవసరం లేదని మందలించారు. దీంతో మనస్తాపం చెంది గురువారం పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు యువకుడిని గద్వాల ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో శుక్రవారం కర్నూలుకు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఇద్దరికి అవయవదానం.. తాను మరణిస్తూ మరో ఇద్దరికి ప్రాణదాతగా నిలిచాడు పరశురాముడు. తల్లిదండ్రులు ఆస్పత్రిలోనే తమ కుమారుడి అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. కళ్లు శుక్లాలను వైద్యులు సేకరించారు. అదేవిధంగా కిడ్నీల టెస్టింగ్ కోసం ల్యాబ్‌కు పంపించారు. అవయవదానానికి ముందుకు వచ్చిన కుటుంబసభ్యులను అక్కడి వైద్యులు, గ్రామస్తులు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూనే మరో పక్క అభినందించారు. తల్లిదండ్రల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివానందంగౌడ్ తెలిపారు. -
బురదరోడ్లు.. ఆపై వైద్యులు లేరు..
బజార్హత్నూర్: వర్షానికి పాడైన రోడ్లు.. సమయానికి అందుబాటులో లేని డాక్టర్లు .. వెరసి ఓ బాలుడి నిండు జీవితం బలైంది. బురద రోడ్డుపై మోటార్‌సైకిల్‌పై ఆ స్పత్రికి చేరడం ఆలస్యం కావడం.. సమ యానికి వైద్యులూ అందుబాటులో లేక ఆ బాలుడు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం డేడ్ర గ్రామానికి చెందిన గిరిజన దంపతులు పంద్ర లక్ష్మణ్, జమునల కుమారుడు పరుశురాం(3) బుధవారం రాత్రి నుంచి తీవ్ర జ్వరం, వాంతులు, విరేచనాలతో బాధపడ్డాడు. గ్రామం నుంచి పీహెచ్‌సీకి 16కిలోమీటర్ల దూరం ఉండగా.. వర్షాలకు అధికభాగం రోడ్డు బురదమయమైంది. అదే రోడ్డుపై గురువారం ఉదయం 6 గంటలకు బయలుదేరి మోటార్‌సైకిల్‌పై పీహెచ్‌సీకి బాలుడిని తీసుకువచ్చారు. అయితే ఆ సమయంలో వైద్యులు అందు బాటులో లేరని, కింది స్థాయి సిబ్బంది పట్టించుకోలేదని, రిమ్స్‌కు తీసుకెళ్లాలని సూచించారని లక్ష్మణ్ తెలిపాడు. కొద్దిసేపటికే బాబు మృతిచెందాడని, వైద్యులు అందుబాటులో ఉంటే తన కుమారుడు బతికేవాడని ఆవేదన వ్యక్తం చేశాడు. దంపతులిద్దరూ మోటార్‌సైకిల్‌పైనే మృతదేహంతో గ్రామానికి చేరుకున్నారు. చనిపోయిన తర్వాతే తీసుకొచ్చారంటూ మెడికల్ ఆఫీసర్ వితండవాదన కాగా, ఈ విషయమై మెడికల్ ఆఫీసర్ భీంరావ్‌ను ఫోన్లో సంప్రదించగా.. బాలుడు మృతిచెందిన తర్వాతే ఆస్పత్రికి తీసుకొచ్చారని తెలిపారు. ఆసుపత్రిలో వైద్యులే లేరు కదా మృతిచెందినట్లు ఎవరు నిర్ధారించారని అడగ్గా.. సమాధానం చెప్పలేదు. -
మహేష్ బాబు డైరెక్టర్ ని రిజెక్ట్ చేసిన నాగ చైతన్య..
-
ఈ సినిమాను మహేశ్ ఒప్పుకోవడానికి ప్రధాన కారణం అదే: డైరెక్టర్ పరశురామ్
Director Parasuram About Mahesh babu Role: దర్శకుడు పరశురామ్ తాజాగా రూపొందించిన చిత్రం ‘సర్కారు వారి పాట’ మరికొద్ది రోజుల్లో థియేటర్లో సందడి చేయబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ జోరు పెంచేసింది. ఈ క్రమంలో నిన్న(మే 2న) ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ 24 గంటల్లోనే మిలియన్ల వ్యూస్ రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే మూవీ ప్రమోషన్లో భాగంగా డైరెక్టర్ పరశురామ్ ఓ మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా మూవీ విశేషాలతో పాటు పలు ఆసక్తిర విషయాలను పంచుకున్నాడు. ‘ఈ సినిమాలో ఆయన క్యారెక్టరైజేషన్ చాలా భిన్నంగా ఉంటుంది. ఇంతకుముందు ఆయన చేసిన ఏ సినిమాలోని పాత్రను.. ఈ సినిమాలో పాత్రతో పోల్చలేము. అందుకే ఆయన కథ విన్న వెంటనే ఓకే చేశారు’ అని అన్నాడు. చదవండి: ఆ సాంగ్ చేస్తున్నప్పుడు మహేశ్‌కు సారీ చెప్పా: కీర్తి సురేష్ అలాగే ‘ఈ సినిమాలో ఆయన రోల్ యాటిట్యూడ్ చాలా కొత్తగా కనిపిస్తుంది. ఈ సినిమా కథాకథనాలు, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ మహేశ్ బాబుకి ఎంతో నచ్చాయి. అన్నింటికీ మించి హీరో పాత్ర, యాటిట్యూడ్ ఆయనను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాను ఆయన ఒప్పుకోవడానికి ప్రధానమైన కారణం కూడా అదే. ఇక సినిమాలో మహేశ్ డాన్స్, ఫైట్స్, నెక్ట్ లెవెల్లో ఉంటాయి’ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. కాగా మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మే 12న విడుదల కాబోతోన్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. కీర్తి సురేశ్ హీరోయిన్గా నటించింది. -
మీడియాతో ‘సర్కారు వారి పాట’ డైరెక్టర్, ఆసక్తికర విషయాలు వెల్లడి
Director Parashuram Talks With Media: తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘సర్కారు వారి పాట’సినిమాను మే 12న విడుదల చేస్తున్నట్లు ఆ సినిమా దర్శకుడు పెట్ల పరశురామ్ వెల్లడించారు. ఆయన కుటుంబ సమేతంగా శ్రీ నూకాలమ్మ తల్లిని శుక్రవారం దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్బంగా ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చెర్లోపాలెంలోని తన స్వగృహంలో మాజీ సర్పంచ్ మాకిరెడ్డి వెంకటరమణతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ పూర్తి చేసేందుకు 30 నెలల సమయం పట్టిందన్నారు. కరోనా కారణంగా ముందస్తు ప్రణాళిక కంటే.. అధిక రోజులు వెచ్చించాల్సి వచ్చిందన్నారు. చదవండి: కృతిశెట్టి నో చెప్పిన ప్రాజెక్ట్‌కు ‘మహానటి’ గ్రీన్ సిగ్నల్ విదేశాలు, మన దేశంలో వివిధ రాష్ట్రాలతో పాటు విశాఖపట్నంలో కూడా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించినట్లు చెప్పారు. హీరో మహేష్‌బాబు, హీరోయిన్ కీర్తి సురేష్ అద్భుతంగా నటించారని.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సన్నివేశాలు, పాటలు, డైలాగ్‌లు ఉంటాయన్నారు. నర్సీపట్నంలోని శ్రీకన్య థియేటర్లో ఈ సినిమా మొదటి ఆట చూస్తానని వెల్లడించారు. ఇప్పటి వరకు ఏడు చిత్రాలకు దర్శకత్వం వహించానని.. సోలో చిత్రం పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిందన్నారు. గీత గోవిందం, ఆంజనేయులు, యువత, శ్రీరస్తు శుభమస్తు సినిమాలు సంతృప్తినిచ్చాయన్నారు. తాండవ షూటింగ్‌లకు అనుకూలం సినిమా షూటింగ్‌లకు విశాఖ జిల్లా ఎంతో అనుకూలమన్నారు. సొంత ప్రాంతంపై మమకారంతో జిల్లాలోని ఏదో ప్రాంతంలో షూటింగ్ చేస్తున్నట్లు చెప్పారు. విశాఖ ఏజెన్సీతో పాటు తాండవ రిజర్వాయర్ అందాలు తనను బాగా ఆకర్షించాయన్నారు. ఇటీవల తాండవ రిజర్వాయర్ సందర్శించానని చెప్పారు. తమ గ్రామ దేవత జిల్లేడుపూడి బుచ్చేంపేట నూకాలమ్మ తల్లిని దర్శించుకోవడానికి కుటుంబ సమేతంగా ఏటా వస్తానన్నారు. తను ఏ పని తలపెట్టినా.. అమ్మవారిని తలచుకుని ప్రారంభిస్తానని తెలిపారు. అమ్మవారి ప్రాంగణంలో సేవా కార్యక్రమాలు చేపట్టడం తన భార్యకు చాలా ఇష్టమన్నారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసి సినిమాలపై ఉన్న ఆసక్తితో ప్రముఖ సినీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరానని.. తర్వాత దర్శకుడిగా మారినట్లు వివరించారు. -
వారు బ్రాహ్మణులపై దారుణాలకు పాల్పడ్డారు
లక్నో : రాముడికి, పరుశురాముడికి మధ్య ఎలాంటి తేడా లేదని, ఇద్దరూ మహా విష్ణు అవతారాలేనని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. కొంతమంది వ్యక్తుల ఆలోచనా ధోరణుల్లోనే తేడా ఉందంటూ ప్రతి పక్ష నాయకులపై మండిపడ్డారు. రాష్ట్రంలోని బ్రాహ్మణులు, పరుశురాముడి విషయంలో ప్రతి పక్షాలు చేస్తున్న అనవసరపు రాజకీయాలపై ఆయన విరుచుకుపడ్డారు. శనివారం వర్షాకాల సమావేశాల చివరి రోజు ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. రామ్‌చరిత్‌మానస్‌లోని కొన్ని పద్యాలను గుర్తు చేశారు. నీచ రాజకీయాలు చేయటంలో మునిగిపోయిన కొందరు ఆ ఇద్దరు దేవుళ్ల మధ్య తేడాలను సృష్టిస్తున్నారన్నారు. ( యోగి వ్యాఖ్యలపై దుమారం ) పరోక్షంగా సమాజ్ వాదీ, బీఎస్పీ పార్టీలను ఉద్ధేశిస్తూ విమర్శలు చేశారు. ‘‘అందరికీ తెలుసు కనౌజీలో ఓ బ్రాహ్మణ యువకుడి తలను నరికేశారు. కాన్షీరామ్ ‘తిలక్, తరాజు, తల్వార్’ అనే నినాదాన్ని ఇచ్చారు. వారు బ్రాహ్మణులపై అనేక దారుణాలకు పాల్పడి, అన్యాయంగా ప్రవర్తించారు. అలాంటప్పుడు వీళ్లు బ్రాహ్మణుల మద్దతును ఎలా సంపాదిస్తారు’ అని అన్నారు. -
కొత్త కాంబినేషన్
‘మజిలీ, వెంకీ మామ’ సినిమాల సక్సెస్‌తో జోష్ మీద ఉన్నారు నాగచైతన్య. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. తాజాగా పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించారు. ఇది నాగచైతన్య కెరీర్లో 20వ చిత్రం. 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘గీత గోవిందం’ చిత్రం తర్వాత పరశురామ్ తెరకెక్కించనున్న చిత్రమిదే. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాలో నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియజేస్తాం అని చిత్రబృందం తెలిపింది. -
మొదలిక మళ్లీ ‘గీత గోవిందం’
అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషనల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఈ యువ కథానాయకుడు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం గీత గోవిందం. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను చిత్రయూనిట్ ఇటీవల ప్రారంభించారు. విజయ్ తనదైన స్టైల్లో ట్వీటర్ వేదికగా ఆసక్తికర కామెంట్స్‌తో సినిమా మీద హైప్ క్రియేట్ చేస్తున్నాడు విజయ్. ఇప్పటికే ఫస్ట్‌లుక్, పోస్టర్లతో ఆకట్టుకున్న చిత్రయూనిట్ ఈ రోజు(మంగళ వారం) తొలి పాటను రిలీజ్ చేశారు. గోపి సుందరం సంగీత సారధ్యంలో ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే’ అంటూ సాగే క్లాసికల్ మెలోడియస్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. అనంత శ్రీరామ్ సాహిత్యమందించిన ఈ పాటను సిద్ధి శ్రీరామ్ ఆలపించారు. పరుశురామ్ దర్శకత్వంలో బన్నీవాసు నిర్మిస్తున్న ఈ సినిమాలో ఛలోఫేం రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్నారు. -
ప్రభాస్‌కో.. ఎన్టీఆర్‌కో ఇస్తే..!
అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషనల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఈ యువ కథానాయకుడు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం గీత గోవిందం. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను చిత్రయూనిట్ ఇటీవల ప్రారంభించారు. విజయ్ స్టైల్లో ట్వీటర్ వేదిక ఆసక్తికర కామెంట్స్‌తో సినిమా మీద హైప్ క్రియేట్ చేస్తున్నాడు విజయ్. పరుశురామ్ దర్శకత్వంలో బన్నీవాసు నిర్మిస్తున్న ఈ సినిమాలో ఛలోఫేం రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్నారు. తాజాగా ట్వీటర్లో హీరో హీరోయిన్ల మధ్య జరిగిన సంభాషణ హాట్ టాపిక్‌గా మారింది. రష్మిక.. ఫిలిం ఫేర్‌లో విజయ్‌కు ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చినందుకు గాను శుభాకాంక్షలు తెలిపారు. రష్మిక : ఫిలిం ఫేర్ బెస్ట్ యాక్టర్ అంట కదా.. కంగ్రాచ్యులేషన్స్ గోవింద్ విజయ్ : మేడమ్.. గీతా మేడమ్.. మీతో టైం గడపడమే నాకు నిజమైన అవార్డ్ మేడమ్. ఇవి వస్తుంటాయ్ పోతుంటాయ్. రష్మిక : ఇగో గోవిందం, ఈ ఓవరాక్షనే తగ్గించుకోమన్నది. అసలు నీకు కాదు ప్రభాస్‌కో.. తారక్ కో ఇస్తే మాకు ఈ గొడవ పోయేది. విజయ్ : అవార్డులో ఏముంది మేడమ్, మీలాంటి వాళ్లు నన్ను ప్రేమించడం చాలు. గీత మేడమ్. రష్మిక: నా లాంటి వాళ్లా..? వాళ్లు ఏంటి? ఆ ప్లూరల్ ఏంటి? తెలుసులే నీ గురించి. ఒక్కరు సరిపోరు. ఎవర్నీ వదలవుగా. విజయ్ : మేడమ్.. నా ఉద్దేశం అది కాదు మేడమ్, ఒకసారి నన్ను 23న కలవండి మేడం. అన్నీ వివరిస్తా. అంటూ సినిమాకు సంబంధించిన అప్ డేట్ 23న వస్తుందంటూ హిట్ ఇచ్చారు. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన టాక్సీవాలా నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉండగా ఇప్పుడు గీత గోవిందం చిత్రం కూడా రిలీజ్‌కు రెడీ అవుతోంది. Madammm, Geetha madam, meetho time gadpadam Naku nijamaina award madam. Ivvi osthuntayi pothuntayi. 😊 https://t.co/iebUrAIp6J — Vijay Deverakonda (@TheDeverakonda) 20 June 2018 Award lo em Undi madam, me lanti vallu nannu preminchatam chaalu.. Geetha madam. 🥰 https://t.co/daC0tiymdA — Vijay Deverakonda (@TheDeverakonda) 20 June 2018 Madammm, naa uddesham adi kaadu madam. Okka sari nannu 23rd kalavandi madam. Anni explain chesta. 🙏 https://t.co/0qarh7JZdM — Vijay Deverakonda (@TheDeverakonda) 20 June 2018 -
ఆ ట్వీట్ పెళ్లి గురించేనా..?
యంగ్ హీరో అల్లు శిరీష్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. 'త్వరలోనే నాకు శ్రీరస్తు శుభమస్తు. మీ అందరి ఆశీస్సులు నాకు కావాలి. మిగతా వివరాలు అతి త్వరలో ఇట్లు మీ సిరి' అంటూ శనివారం అల్లు శిరీష్ ట్వీట్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ అల్లు శిరీష్ పెళ్లి సంబంధించినదే అయి ఉంటుందా..? అంటూ టాలీవుడ్లో చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెళ్లి పనుల్లో బిజీగా ఉందన్న టాక్ వినిపిస్తోంది. మెగా ఫ్యామిలీ కన్ఫామ్ చేయకపోయినా సోషల్ మీడియాలో వస్తున్న ఫోటోలు ఈ విషయంపై క్లారిటీ ఇస్తున్నాయి. ఈ ఫిబ్రవరి నెలాఖరున (25వ తేదీ ప్రాంతంలో) పెళ్లి నిర్వహించడానికి మెగా ఫ్యామిలీ రెడీ అవుతోంది. ఆ తరువాత శిరీష్ పెళ్లి కూడా వెంటనే ఉంటుదేమో అన్న డౌట్ మొదలైంది. అయితే కొంత మంది మాత్రం ఈ ట్వీట్ అల్లు శిరీష్ నెక్ట్స్ సినిమాకు సంబంధించి అన్న వాదన వినిపిస్తున్నారు. ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో ఓ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్నాడు శిరీష్. ఈ సినిమాకు 'శ్రీరస్తు శుభమస్తు' అన్న టైటిల్‌ను ఫైనల్ చేశారని, ఆ విషయాన్నే శిరీష్ ఇలా ఎనౌన్స్ చేసి ఉంటాడని భావిస్తున్నారు. ఏది నిజమో తెలియాలంటే మాత్రం శిరీష్ నెక్ట్స్ ట్వీట్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే. Twaralone naku srimastu subhamastu. Mi andhari aaseesulu naku kavali. Migata vivaralu ati twaralo. Itlu, mee Siri — Allu Sirish (@AlluSirish) February 13, 2016