విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' టీజర్ ఎప్పుడంటే..? | Vijay Deverakonda And Mrunal Thakur Starrer Family Star Movie Teaser Release Date Announced, Deets Inside - Sakshi
Sakshi News home page

Family Star Movie Teaser Update: విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' టీజర్ ఎప్పుడంటే..?

Mar 3 2024 2:12 PM | Updated on Mar 3 2024 4:20 PM

Family Star Movie Teaser Announced - Sakshi

స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న 'ఫ్యామిలీ స్టార్' సినిమా టీజర్ రిలీజ్ డేట్ అండ్ టైమ్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సినిమా టీజర్ ను రేపు మార్చి 4న సోమవారం సాయంత్రం 6:30 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు. "ఫ్యామిలీ స్టార్" టీజర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ సందర్భంగా ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

"ఫ్యామిలీ స్టార్" సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. హోల్ సమ్ ఎంటర్ టైనింగ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. 'ఫ్యామిలీ స్టార్' చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు.

మరో నెల రోజుల టైమ్ మాత్రమే ఉండటంతో ప్రమోషన్ యాక్టివిటీస్ స్పీడప్ చేసింది మూవీ టీమ్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్, పోస్టర్స్, నందనందనా లిరికల్ సాంగ్ ను ఆడియెన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇవన్నీ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన "ఫ్యామిలీ స్టార్" సినిమా సూపర్ హిట్ కానుందనే ఇండికేషన్స్ ఇస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement