బురదరోడ్లు.. ఆపై వైద్యులు లేరు..  | A three year old boy died of fever | Sakshi
Sakshi News home page

బురదరోడ్లు.. ఆపై వైద్యులు లేరు.. 

Published Fri, Aug 4 2023 2:41 AM | Last Updated on Fri, Aug 4 2023 4:08 PM

A three year old boy died of fever - Sakshi

బజార్‌హత్నూర్‌: వర్షానికి పాడైన రోడ్లు.. సమయానికి అందుబాటులో లేని డాక్టర్లు .. వెరసి ఓ బాలుడి నిండు జీవితం బలైంది. బురద రోడ్డుపై మోటార్‌సైకిల్‌పై ఆ స్పత్రికి చేరడం ఆలస్యం కావడం..  సమ యానికి వైద్యులూ అందుబాటులో లేక ఆ బాలుడు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.

కుటుంబ సభ్యుల కథనం ప్రకారం ఆదిలాబాద్‌ జిల్లా బజార్‌హత్నూర్‌ మండలం డేడ్ర గ్రామానికి చెందిన గిరిజన దంపతులు పంద్ర లక్ష్మణ్, జమునల కుమారుడు పరుశురాం(3) బుధవారం రాత్రి నుంచి తీవ్ర జ్వరం, వాంతులు, విరేచనాలతో బాధపడ్డాడు. గ్రామం నుంచి పీహెచ్‌సీకి 16కిలోమీటర్ల దూరం ఉండగా.. వర్షాలకు అధికభాగం రోడ్డు బురదమయమైంది. అదే రోడ్డుపై గురువారం ఉదయం 6 గంటలకు బయలుదేరి మోటార్‌సైకిల్‌పై పీహెచ్‌సీకి బాలుడిని తీసుకువచ్చారు.

అయితే ఆ సమయంలో వైద్యులు అందు బాటులో లేరని, కింది స్థాయి సిబ్బంది పట్టించుకోలేదని, రిమ్స్‌కు తీసుకెళ్లాలని సూచించారని లక్ష్మణ్‌ తెలిపాడు. కొద్దిసేపటికే బాబు మృతిచెందాడని, వైద్యులు అందుబాటులో ఉంటే తన కుమారుడు బతికేవాడని ఆవేదన వ్యక్తం చేశాడు. దంపతులిద్దరూ మోటార్‌సైకిల్‌పైనే మృతదేహంతో గ్రామానికి చేరుకున్నారు. 

చనిపోయిన తర్వాతే తీసుకొచ్చారంటూ మెడికల్‌ ఆఫీసర్‌ వితండవాదన కాగా, ఈ విషయమై మెడికల్‌ ఆఫీసర్‌ భీంరావ్‌ను ఫోన్‌లో సంప్రదించగా.. బాలుడు మృతిచెందిన తర్వాతే ఆస్పత్రికి తీసుకొచ్చారని తెలిపారు. ఆసుపత్రిలో వైద్యులే లేరు కదా మృతిచెందినట్లు ఎవరు నిర్ధారించారని అడగ్గా.. సమాధానం చెప్పలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement