వారు బ్రాహ్మణులపై దారుణాలకు పాల్పడ్డారు | CM Adityanath Comments Over Brahmins And Parshuram Issue | Sakshi
Sakshi News home page

రాముడు, పరుశురాముడు వేరు కాదు

Aug 23 2020 2:39 PM | Updated on Aug 23 2020 2:45 PM

CM Adityanath Comments Over Brahmins And Parshuram Issue - Sakshi

అసెంబ్లీలో మాట్లాడుతున్న యోగీ

వారు బ్రాహ్మణులపై అనేక దారుణాలకు పాల్పడి, అన్యాయంగా...

లక్నో : రాముడికి, పరుశురాముడికి మధ్య ఎలాంటి తేడా లేదని, ఇద్దరూ మహా విష్ణు అవతారాలేనని ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ అన్నారు. కొంతమంది వ్యక్తుల ఆలోచనా ధోరణుల్లోనే తేడా ఉందంటూ ప్రతి పక్ష నాయకులపై మండిపడ్డారు. రాష్ట్రంలోని బ్రాహ్మణులు, పరుశురాముడి విషయంలో ప్రతి పక్షాలు చేస్తున్న అనవసరపు రాజకీయాలపై ఆయన విరుచుకుపడ్డారు. శనివారం వర్షాకాల సమావేశాల చివరి రోజు ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. రామ్‌చరిత్‌మానస్‌లోని కొన్ని పద్యాలను గుర్తు చేశారు. నీచ రాజకీయాలు చేయటంలో మునిగిపోయిన కొందరు ఆ ఇద్దరు దేవుళ్ల మధ్య తేడాలను సృష్టిస్తున్నారన్నారు. ( యోగి వ్యాఖ్యలపై దుమారం )

పరోక్షంగా సమాజ్‌ వాదీ, బీఎస్పీ పార్టీలను ఉద్ధేశిస్తూ విమర్శలు చేశారు. ‘‘అందరికీ తెలుసు కనౌజీలో ఓ బ్రాహ్మణ యువకుడి తలను నరికేశారు. కాన్షీరామ్‌ ‘తిలక్‌, తరాజు, తల్వార్‌’  అనే నినాదాన్ని ఇచ్చారు. వారు బ్రాహ్మణులపై అనేక దారుణాలకు పాల్పడి, అన్యాయంగా ప్రవర్తించారు. అలాంటప్పుడు వీళ్లు బ్రాహ్మణుల మద్దతును ఎలా సంపాదిస్తారు’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement