ఆ ట్వీట్ పెళ్లి గురించేనా..? | Allu Sirish Tweet Raises Doubts on his Marriage | Sakshi
Sakshi News home page

ఆ ట్వీట్ పెళ్లి గురించేనా..?

Published Sat, Feb 13 2016 4:54 PM | Last Updated on Sun, Sep 3 2017 5:34 PM

ఆ ట్వీట్ పెళ్లి గురించేనా..?

ఆ ట్వీట్ పెళ్లి గురించేనా..?

యంగ్ హీరో అల్లు శిరీష్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. 'త్వరలోనే నాకు శ్రీరస్తు శుభమస్తు. మీ అందరి ఆశీస్సులు నాకు కావాలి. మిగతా వివరాలు అతి త్వరలో ఇట్లు మీ సిరి' అంటూ శనివారం అల్లు శిరీష్ ట్వీట్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ అల్లు శిరీష్ పెళ్లి సంబంధించినదే అయి ఉంటుందా..? అంటూ టాలీవుడ్లో చర్చించుకుంటున్నారు.

ప్రస్తుతం మెగా ఫ్యామిలీ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెళ్లి పనుల్లో బిజీగా ఉందన్న టాక్ వినిపిస్తోంది. మెగా ఫ్యామిలీ కన్ఫామ్ చేయకపోయినా సోషల్ మీడియాలో వస్తున్న ఫోటోలు ఈ విషయంపై క్లారిటీ ఇస్తున్నాయి. ఈ ఫిబ్రవరి నెలాఖరున (25వ తేదీ ప్రాంతంలో) పెళ్లి నిర్వహించడానికి మెగా ఫ్యామిలీ రెడీ అవుతోంది. ఆ తరువాత శిరీష్ పెళ్లి కూడా వెంటనే ఉంటుదేమో అన్న డౌట్ మొదలైంది.

అయితే కొంత మంది మాత్రం ఈ ట్వీట్ అల్లు శిరీష్ నెక్ట్స్ సినిమాకు సంబంధించి అన్న వాదన వినిపిస్తున్నారు. ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో ఓ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్నాడు శిరీష్. ఈ సినిమాకు 'శ్రీరస్తు శుభమస్తు' అన్న టైటిల్ను ఫైనల్ చేశారని, ఆ విషయాన్నే శిరీష్ ఇలా ఎనౌన్స్ చేసి ఉంటాడని భావిస్తున్నారు. ఏది నిజమో తెలియాలంటే మాత్రం శిరీష్ నెక్ట్స్ ట్వీట్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement