ఈ రోజే ఆ పండుగ చేసుకున్నట్లుంది: మెగా హీరో | 'Very happy to see Boss back on sets' tweets Allu Sirish | Sakshi
Sakshi News home page

ఈ రోజే ఆ పండుగ చేసుకున్నట్లుంది: మెగా హీరో

Published Thu, Jun 23 2016 5:35 PM | Last Updated on Fri, Oct 5 2018 9:08 PM

ఈ రోజే ఆ పండుగ చేసుకున్నట్లుంది: మెగా హీరో - Sakshi

ఈ రోజే ఆ పండుగ చేసుకున్నట్లుంది: మెగా హీరో

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ తరుణం గురువారం రానేవచ్చింది. ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మెగాస్టార్ చిరంజీవి మేకప్ వేసుకున్నారు. చిరు సినిమా ప్రారంభం అవడం అభిమానులతోపాటు టాలీవుడ్ నటీనటులకు కూడా పండుగలా ఉంది. ఇప్పటికే తొలిరోజు సెట్స్లో గ్లామరస్గా కనిపిస్తున్న చిరు ఫొటోలు హల్ చల్ చేస్తున్నాయి.   

ఫస్ట్ డే షూటింగ్ కు హాజరైన అల్లు శిరీష్.. మావయ్య మెస్మరైజింగ్ యాక్టింగ్ చూసి ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. అదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. నాన్న, అన్నయ్యలతో కలిసి చిరంజీవి 150వ సినిమా సెట్స్ కు వెళ్లిన శిరీష్..  చిరు ఎప్పటిలానే డాషింగ్గా కనిపిస్తున్నారు.. బాస్ను తిరిగి సెట్స్ లో చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశాడు. వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సామాన్య రైతుల సమస్య గురించి పోరాడే నాయకుడి పాత్రలో చిరంజీవి నటిస్తున్నారు.

మరోవైపు మేనల్లుడు, హీరో సాయి ధరమ్ తేజ కూడా చిరంజీవి 150వ సినిమా షూటింగ్ ప్రారంభంపై స్పందించాడు. షూటింగ్ తొలిరోజే 50 రోజుల పండుగ చేసుకున్నంత ఆనందంగా ఉందని ట్వీట్ చేశాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement