యువ నటుడితో శ్రియా భూపాల్‌ వీకెండ్‌ పార్టీ | shriya bhupal spotted partying with Allu Sirish | Sakshi
Sakshi News home page

యువ నటుడితో శ్రియా భూపాల్‌ వీకెండ్‌ పార్టీ

Published Mon, May 1 2017 4:17 PM | Last Updated on Tue, Sep 5 2017 10:08 AM

యువ నటుడితో శ్రియా భూపాల్‌ వీకెండ్‌ పార్టీ

యువ నటుడితో శ్రియా భూపాల్‌ వీకెండ్‌ పార్టీ

శ్రియా భూపాల్‌ ఈ పేరు గుర్తుండే ఉంటుంది కదా. జీవీకే కుటుంబానికి చెందిన ఆమె...అక్కినేని కుటుంబంలో కోడలుగా అడుగుపెట్టబోయి... జస్ట్‌ మిస్‌ అయిన విషయం తెలిసిందే. అఖిల్, శ్రియా భూపాల్‌లకు నిశ్చితార్థం కూడా జ‌రిగి చివరి నిమిషంలో వారిద్దరి పెళ్లి ర‌ద్దు అయిన వార్త గతంలో హాట్‌ టాపిక్‌ అయిన విషయం తెలిసిందే. తాజాగా శ్రియా భూపాల్‌ పేరు సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. టాలీవుడ్ హీరో అల్లు శిరీష్‌తో కలిసి శ్రియా భూపాల్ రెడ్డి వీకెండ్ పార్టీలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు కెమెరా కంటికి చిక్కాయి. వీరిద్దరూ పార్టీని ఎంజాయ్‌ చేస్తూ, డ్యాన్స్‌ చేసిన ఫోటోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

అంతే కాకుండా ‘త‌న‌ బెస్ట్ ఫ్రెండ్ శరత్ రెడ్డి, బేబీ సిస్టర్ శ్రియా‌తో పార్టీ’ లో  ఉన్నానని, ఈ సంద‌ర్భంగా తీసిన  ఓ ఫొటోను అల్లు శిరీష్‌ పోస్ట్ చేశాడు. చిరంజీవితో పాటు,అల్లు అరవింద్‌ కుటుంబానికి జీవీకే ఫ్యామిలీకి మంచి సాన్నిహిత్యమే ఉంది.  వీరి ఇళ్లలో జరిగే అన్ని శుభకార్యాల్లో అందరూ హాజరు అవుతూ ఉంటారు.

అంతేకాకుండా రామ్‌చరణ్‌ భార్య ఉపాసన కూడా శ్రియా భూపాల్‌ ఎంగేజ్‌మెంట్‌ సమయంలో చాలా క్లోజ్‌గా మూవ్‌ అయిన విషయం విదితమే. కాగా అఖిల్‌తో పెళ్లి రద్దు అనంతరం శ్రియా  కుటుంబం ...విదేశాలకు వెళ్లింది. అక్కడే ఓ ఎన్నారైతో ఆమె వివాహం నిశ్చయం అయినట్లు వార్తలు వచ్చాయి. త్వరలో ఎన్నారైతో శ్రియా భూపాల్‌ మూడుముళ్లు వేయించుకోనుందట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement