
సెన్సేషన్ స్టార్ విజయ్‌దేవరకొండ చేతి నిండా ప్రాజెక్టులతో తెగ బిజీగా ఉన్నాడు. కన్నడ క్యూటీ రష్మిక మందనతో కలిసి కాస్త వెరైటీగా గీత గోవిందం చిత్ర ప్రమోషన్‌లో మనోడు పాల్గొంటున్నాడు. వారిద్దరి సరదా సంభాషణలతో ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ కాస్త తేడా పోస్టర్‌నే వదిలారు.
‘మీరు ఏమైనా అనుకోండి. నా అఫీసియల్ స్టేటస్ మాత్రం ఇదే మేడమ్’ అంటూ పోస్టర్‌ను ఉంచాడు. పోస్టర్ బ్యాక్ గ్రౌండ్‌లో ‘ఐ యామ్ 25.. స్టిల్ వర్జిన్ మేడమ్.. అంటూ గోవిందం(విజయ్).. గీత(రష్మిక)ను ఓరగా చూస్తున్నాడు. పరుశురామ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న గీత గోవిందం ఆగష్టు 15న విడుదల కానుంది. వీటితోపాటే విజయ్ నటించిన టాక్సీవాలా, నోటా చిత్రాలు శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుని రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి.
Meeru em aina anukondi,
My official status matram idhe madam.#GeethaGovindam
This Independence Day. pic.twitter.com/02ofgVXHC8
— Vijay Deverakonda (@TheDeverakonda) July 3, 2018