
‘‘ఈ పదేళ్లలో నేను ఆరు (యువత, సోలో, ఆంజనేయులు, సారొచ్చారు, శ్రీరస్తు–శుభమస్తు, గీత గోవిందం) సినిమాలు చేశాను. కొన్ని సినిమాలు ఆడలేదు. రైటర్‌గా, డైరెక్టర్‌గా ‘గీత గోవిందం’ సినిమా నాకు పునర్జన్మను ప్రసాదించింది’’ అన్నారు పరశురామ్. విజయ్ దేవరకొండ, రష్మికా మండన్నా జంటగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘గీత గోవిందం’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించారు. ఇటీవల రిలీజైన ఈ సినిమా సక్సెస్ టాక్‌తో ప్రదర్శించబడుతోందని చిత్రబృందం పేర్కొంది.
పరశురామ్ ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు పూర్తయిన సందర్భంగా మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులకు థ్యాంక్స్. అవకాశం ఇచ్చిన అల్లు అరవింద్‌గారికి, ‘బన్నీ’ వాసుకి, విజయ్ దేవరకొండకి థ్యాంక్స్. ఈ సినిమా వంద కోట్ల క్లబ్‌లో చేరడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా కథను బన్నీ (అల్లు అర్జున్)కి రాంగ్ టైమ్‌లో చెప్పాను. అయితే కథను మాత్రం వదలొద్దు అన్నారు. నెక్ట్స్ ఇదే బ్యానర్‌లో మరో సినిమా, మైత్రీ మూవీస్‌లో ఓ సినిమా ఉండొచ్చు. మంచు విష్ణుతో ఓ సినిమా ఉంటుంది. ఫ్యూచర్‌లో పూరి జగన్నా«థ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా ఓ మూవీ ఉండొచ్చు. నాకు ప్రొడక్షన్ వైపు కూడా ఆసక్తి ఉంది’’ అన్నారు.