
‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఫేమస్ అయ్యాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డిగా విజయ్ నటనకు సినీ ప్రముఖులే కాక విమర్శకుల ప్రశంసలూ దక్కాయి. అయితే అర్జున్ రెడ్డి పాత్రల్లోంచి బయటకు రావడానికి చాలా సమయం పడుతుందని అంతా అనుకున్నారు. కానీ ‘గీత గోవిందం’ సినిమాతో మళ్లీ తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు విజయ్.
ఈ సినిమా విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తూ.. సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇప్పటికే ఈ సినిమాపై రాజమౌళి, మహేష్ బాబు, రామ్‌చరణ్ లాంటి సెలబ్రెటీలు స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాను చూసి చిత్రబృందాన్ని చూసి అభినందించారు.
‘గీత గోవిందం’ ఆడియో ఫంక్షన్‌కు మెగాస్టార్ చిరంజీవి వస్తారని ప్రచారం జరిగింది. అయితే సైరా షూటింగ్‌లో బిజీగా ఉన్న చిరంజీవి ఆ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. అయితే ఆదివారం జరుగనున్న సక్సెస్ మీట్‌కు చిరు ముఖ్య అతిథిగా రానున్నారని చిత్రబృందం ప్రకటించింది. గోపి సుందర్ సంగీత అందించిన ఈ సినిమాను పరుశురామ్ తెరకెక్కించారు.
#MegaStarChiranjeevi is the chief guest for #GeethaGovindam #Blockbustercelebrations on this Sunday (19th August ) At Kotla Vijaya Bhaskar Reddy Stadium Yousufguda , pic.twitter.com/XsUxmHK6nB
— Suresh Kondi (@V6_Suresh) August 17, 2018
Comments
Please login to add a commentAdd a comment