
విజయ్ దేవరకొండ
‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే...’ ఈ పాట ‘గీత గోవిందం’ సినిమాలోనిదని సినీ లవర్స్ ఎవర్ని అడిగినా ఇట్టే చెప్పేస్తారు. అంతలా ఈ సాంగ్ శ్రోతలను ఆకట్టుకుంది. ఇప్పుడు ‘గీతగోవిందం’ చిత్రంలోని రెండో పాట ‘వాట్ ద వాట్ ద ఎఫ్’ ఈ రోజు విడుదల అవుతోంది. ఈ సాంగ్‌ను హీరో విజయ్ దేవరకొండనే పాడటం విశేషం. పరశురామ్ దర్శకత్వంలో విజయ్‌దేవర కొండ, రష్మిక మండన్నా జంటగా రూపొందిన సినిమా ‘గీతగోవిందం’.
అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై ‘బన్ని’ వాసు నిర్మించిన ఈ సినిమా వచ్చే నెల 15న విడుదల కానుంది. ‘‘ఆల్రెడీ రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ ‘ఇంకేం కావాలే’, టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. గోపీసుందర్ మంచి సంగీతం అందించారు. ఈ రోజు ఫ్రస్ట్రేషన్ సింగర్‌గా విజయ్ దేవరకొండ పాడిన సాంగ్ రిలీజ్ అవుతుంది. ఈ నెల 29న పాటల విడుదల వేడుకను గ్రాండ్‌గా చేయబోతున్నాం’’ అన్నారు నిర్మాతలు. నాగబాబు, సుబ్బరాజు, ‘వెన్నెల’ కిశోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు నటించిన ఈ సినిమాకు మణికందన్ ఛాయాగ్రాహాకుడు.
Comments
Please login to add a commentAdd a comment